తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ న‌డుస్తోందా ?  ఈ కోల్డ్ వార్ క్ర‌మంలోనే కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం చేయాల‌ని కేసీఆర్ తొంద‌ర ప‌డుతున్నారా ? అంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డే ట్విస్ట్ చోటు చేసుకుంద‌ని.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని కంగారు ప‌డ్డ కేసీఆర్ ఇప్పుడు త‌న నిర్ణ‌యం వాయిదా వేసుకుని క‌విత‌ను త్వ‌ర‌గా కేబినెట్లోకి తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకే ఆమెను ఆఘ‌మేఘాల మీద ఎమ్మెల్సీని చేశార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌కాలీన రాజ‌కీయ వేత్త‌లో కేసీఆర్ ఎంత అప‌ర మేథావో తెలిసిందే.

ఎలాంటి రాజ‌కీయ మేథావుల‌ను అయినా గింగ‌రాలు కొట్టించ‌డంలో కేసీఆర్‌కు మించిన నేత‌లు ఉండ‌రు. ఎంతో మంది గొప్ప రాజ‌కీయ నేత‌లు సైతం త‌మ వార‌సుల‌ను రాజ‌కీయంగా ప్ర‌మోట్ చేయ‌డంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ లాంటి మేథావే త‌మ వార‌సుల‌ను ప్ర‌మోట్ చేయ‌లేక‌పోయారు. ఎన్టీఆర్‌కు ఎంతో మంది వార‌సులు, వార‌సురాళ్లు ఉన్నా ఒక్క‌రు కూడా రాణించ లేక‌పోయారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎంత‌లా రాజ‌కీయం చేసినా ఆమె వార‌సుడిగా రాహుల్ గాంధీని ఏ మాత్రం ప్రొజెక్ట్ చేయ‌లేక‌పోయింది.

చివ‌ర‌కు శ‌తాబ్దాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని న‌డిపే నాథుడే లేకుండా పోయాడు. కేసీఆర్ మాత్రం ఆ త‌ప్పు తాను చేయ‌కూడ‌ద‌ని ముందు నుంచే ప్లాన్‌తో ఉన్నారు. ఇప్ప‌టికే కేటీఆర్‌ను త‌న వార‌సుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక క‌విత కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో రాణించాల‌ని తండ్రిపై ఒత్తిడి చేస్తున్నార‌ట‌. దీంతో కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత మ‌ధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఇక క‌విత‌ను కూడా ముఖ్య‌మంత్రిని చేయాల‌ని పార్టీలో కొంద‌రు నేత‌ల‌తో పాటు బంధువులు కూడా కేసీఆర్‌ను ఒత్తిడి చేస్తున్నార‌ట‌.

ఈ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల నేప‌థ్యంలోనే కేసీఆర్‌.. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ వస్తున్నార‌ట‌. అయితే ఈ ప్ర‌చారంలో నిజానిజాలు ఏమిటో కాని.. ప్ర‌స్తుతం ఇదే విష‌యం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ పుకారుగా వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: