జగన్ ఢిల్లీ టూర్ అర్జంటుగా పెట్టుకున్నారు. ఉన్నట్లుండి జగన్ హస్తినకు ఎందుకు వెళ్తున్నారు అన్న చర్చ అయితే మొదలైంది. గత ఏడాది చివరలో జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అయితే నాటికీ నేటికీ ఏపీ రాజకీయాలలో మార్పు కనిపిస్తోంది.  ఏపీలో ఒక విధంగా రాజకీయ వేడి గట్టిగానే రాజుకుంది.

మతం కార్డు తో విపక్షాలు గట్టిగానే జగన్ సర్కార్ ని కార్నర్ చేస్తున్నాయి. అదే సమయంలో జగన్ని మతం పేరు పెట్టి విమర్శలు చేస్తున్నాయి. ఆయన ప్ర‌భుత్వాన్ని కోట్లాది మంది ఎన్నుకుంటే కేవలం ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే సర్కార్ గా బురద జల్లే ప్రయత్నం కూడా జరుగుతోంది.

ఇక ఏపీలో దేవతా విగ్రహాల విద్వంశం  యధేచ్చగా సాగిపోంది. దీని మీద జగన్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఇక ఈ మధ్యనే డీజీపీ గౌతం సవాంగ్ అయితే విగ్రహాల విద్వంశం వెనక ఎవరు ఉన్నారో చెప్పుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా ఏపీలో  రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా కేంద్ర హోం మంత్రి దృష్టికి జగన్ తీసుకువస్తారని అంటున్నారు. జగన్ ఢిల్లీ టూర్ తరువాత అరెస్టులు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయని చెబుతున్నారు.

అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హక్కుల మీద జగన్ చర్చిస్తారని అంటున్నారు. అలాగే జమిలి ఎన్నికల మీద పూర్తి క్లారిటీని కేంద్రం నుంచి జగన్ తీసుకుంటారని చెబుతున్నారు. ఇక కేంద్రం బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోతున్నారు. దాంతో ఏపీకి బడ్జెట్ లో నిధులు దండీగా కేటాయించాలని కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టాలని జగన్ కోరనున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఢిలీ టూర్ లో అన్నీ సెట్ చేసుకుని జగన్ వస్తారని అంటున్నారు. జగన్ హస్తిన పర్యటన మీద ఏపీ రాజకీయాలో ఇపుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: