ఏపీలో బీజేపీ  ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల నాటికి ఎలాగోలా బలపడేలా కనిపిస్తుంది.. ఇప్పటికే బీజేపీ కొంత బలపడడం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కి కొంత ప్రయోజనాలను దెబ్బ తీసే అంశం కాగా ఇప్పుడు రాష్ట్రంలో చేపడుతున్న ఓ కార్యక్రమం వల్ల ఆ సెగ అధికార పార్టీ కి కూడా తగులుతుందని చెప్పొచ్చు.రాష్ట్రంలో జరుగుతున్న వరుస దేవాలయాల దాడులు ఘటనలు అందరిలో కలకలం రేపుతుండగా బీజేపీ పార్టీ దీన్ని పెద్ద అంశంగా చేసి రాజకీయంగా బలపడాలని చూస్తుంది.. ఇప్పటికే అంతర్వేది, దుర్గ గుడి వంటి విషయాల్లో బీజేపీ బాగానే లాభపడింది.  ఇప్పుడు రామతీర్థం ఘటనని పెద్దగా హైలైట్ చేసి రాజకీయంగా బలపడాలని చూస్తుంది. 

హిందుత్వ పార్టీ గా పేరున్న బీజేపీ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుని కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో జరిగిన ఏపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఫిబ్రవరి 4 నుంచి 8 రోజుల పాటు నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.  పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జన జాగృతి సభలను నిర్వహిస్తామని వెల్లడించారు.

అయితే ముందుగా రామతీర్థం నుంచి యాత్ర ను ప్రారంభించాలని అనుకున్నా అక్కడే ముగిస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు. అయితే ఈ యాత్రలు జరిగే చోటకి ఒక్కో జాతీయ నేతను ఆహ్వానించి ప్రజలకు బీజేపీ పార్టీ ప్రాబల్యం గురించి వివరించాలని పార్టీ భావిస్తుంది. రోజూ కుదరకపోయినా.. ప్రదానమైన ఆలయాల దగ్గరకు వచ్చినప్పుడు.. పిలిపించాలని అనుకుంటున్నారు. ఇక ముందుగా ప్రభుత్వాన్ని హిందూత్వ అంశంపైనే ఇరుకున పెట్టాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. తమపై ఆరోపణలు చేసిన డీజీపీ విషయంలోనూ బీజేపీ సీరియస్ గా ఉంది. డీజీపీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకని .. ఈ నెల 20 తేదీలోపు డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: