అమెరికా  గురించి అంతా గొప్పగా చెప్పుకుంటారు. అక్కడ అంతా  భూతల స్వర్గం అని  కీర్తిస్తారు. అయితే దాని వెనక ఉన్న డొల్లతనం అపుడపుడు బయటపడుతున్నా అసలు సీన్ మొత్తం బయటపెట్టేశారు అమెరికా అధ్యక్ష స్థానం నుంచి దిగబోతున్న డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు.

వారు ఎంత పని చేశారంటే కొన్ని రోజుల క్రితం అమెరికా పార్లమెంట్ క్యాపిటల్ బిల్డింగ్ మీద దాడి చేశారు. నాడు జరిగిన రచ్చలో కొందరు చనిపోయారు కూడా. ప్రపంచం అంతా దీన్ని చూసి విస్తుపోయింది. అమెరికాలో ఈ చిల్లర రాజకీయాలు ఎంటి అని కూడా షాక్ తిన్నది. ఇదిలా ఉంటే అమెరికా క్యాపిటల్  భవనం మీద దాడి జరిగిన తరువాత ఇపుడు ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణం చేయనున్నారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పీఠం ఎక్కనీయమని ట్రంప్ మద్దతుదారులు ఓ వైపు గట్టిగా మాట్లాడిన నేపధ్యంలో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణం వేళ హై ఓల్టేజ్ టెన్షన్ తో వాషింగ్టన్ సిటీ కనిపిస్తోంది.

బైడెన్ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేయడానికి కౌంట్ డౌన్ మొదలైంది. అదే సమయంలో పార్లమెంట్ బిల్డింగ్ మీద జరిగిన దాడిని గుర్తు చేసుకుంటున్న భద్రతా బలగాలు వాషింగ్టన్ లో చీమ కూడా దూరకుండా తమ భద్రతను ఒక్కసారిగా పెంచేశారని టాక్. కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్  బాధ్యతలు తీసుకునే వేళ ఏ రకమైన అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడడం కత్తి మీద సాము అవుతోంది అంటున్నారు. మొత్తానికి ఓ వైపు అధ్యక పీఠం వైపుగా బైడెన్ కదులుతున్నారు. మరో వైపు భద్రతావలయం లోకి  వైట్ హౌస్ పరిసరాలు వెళ్ళిపోయాయి అంటున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఎక్కడ చూసినా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: