జగనన్న ఇంటి పట్టా దారుల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం అని ఆయన స్పష్టం చేసారు. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం అని అన్నారు. సంక్షేమం అభివృద్ధి తో ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకున్నారు అని మండిపడ్డారు. విగ్రహాలను కొంత మంది రాజకీయ పార్టీల ముసుగులో ఎత్తుకు వెళ్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారు అని మండిపడ్డారు. మతాల పేరుతో ఓట్లు అడిగిన చరిత్ర ఎక్కడైనా ఉందా... అని నిలదీశారు. ఒకటి రెండు పత్రికలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. ఎక్కడ జరిగినా సంఘటన దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. దేనికి భయపడేది లేదు అని స్పష్టం చేసారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకుని ముందుకు వెళ్తాము అని అన్నారు. భారతీయ జనతాపార్టీ  నేతలు ఉనికిని కాపాడుకునేందుకే మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారు అన్నారు.

అందుకే రాష్ట్రంలో మత కల్లోలాలు... కులాల మద్య వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. డీజీపీ ఒక సీనియర్ పోలీస్ అధికారి... చెప్పేది అవాస్తవమైతే బీజేపీ నేతలు వివరణ ఇవ్వవచ్చు అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారికి బీజేపీతో సంబంధం లేకుంటే.. మా వాళ్లు కాదు అని చెప్పాలి అని అన్నారు. డీజీపికి స్టేట్ మెంట్ రాసివ్వండి సోము వీర్రాజు... మీరు రాసిచ్చిన స్టేట్ మెంట్ నే డీజీపీ చదువుతాడు అని ఆయన ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకో మరో పార్టీకో లబ్ధి చేసేందుకే   ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: