వికారాబాద్ లో బిజెపి సభ జరిగింది. ఈ సభకు పలువురు బిజెపి నేతలు హాజరయ్యారు.  బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, స్వామీగౌడ్, రామచంద్రరావు, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు. మాజీమంత్రి చంద్రశేఖర్  కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్  మాట్లాడుతూ... తెలంగాణలో కుటుంబ పాలనకు బీజేపీ చరమగీతం పాడటం ఖాయం అని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తోన్న వారికి కాలమే సమాధానం చెప్తోంది అని ఆయన పేర్కొన్నారు.

ఆటవిక పాలనకు ముగింపు పలికే వాడు కరీంనగర్ లో పుట్టాడు అని అన్నారు. అధికార మదంతో విర్రవీగిన వారి చరిత్ర ఏమైందో అందకీ తెలుసు అని ఆయన వెల్లడించారు. కుటుంబ పాలనకు మూడేళ్ళ తర్వాత రాజకీయ  సమాధి ఖాయం అని ఆయన హెచ్చరించారు. అవినీతి మచ్చ లేని నాయకులు బీజేపీలో మాత్రమే ఉన్నారు అని ఆయన తెలిపారు. నడ్డా నాయకత్వంలో‌ బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని లక్ష్మణ్ స్పష్టం చేసారు.

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని రుజువైంది అని ఆయన అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే సుఖపడ్తోంది అని ఆయన ఆరోపించారు. కొలువులు కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే వచ్చాయి అని అన్నారు. బీజేపీలో మాత్రమే సామాజిక న్యాయం సాధ్యం అని ఆయన స్పష్టం చేసారు. టీఆర్ఎస్ లో దళితులు, బీసీలకు గౌరవం, గుర్తింపు లేదు అని అన్నారు. టీఆర్ఎస్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ కేసీఆర్ కుటుంబమే అని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ పేరుతో కేసీఆర్ ప్రజలను దగా చేశాడు అని మండిపడ్డారు. ఏ ఎన్నిక జరిగినా.‌‌. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి అని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: