మంత్రి కొడాలి నాని విమర్శలకు దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. ఉమ ఇంటికి వెళ్లి గొల్లపూడి లో బడిత పూజ చేస్తా అని కొడాలి నాని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఉమా... కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు గొల్లపూడి యన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా  అని ఉమా అన్నారు. రేపు సీఎం వస్తారో మంత్రి కొడాలి నాని వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు దేవినేని ఉమ. గొల్లపూడి లో దీక్షకు కూర్చుంటా...టచ్ చేసి చూడు అంటూ ఉమ వ్యాఖ్యలు చేసారు.

మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షకు కూర్చుంటున్నా అని ఆయన సవాల్ చేసారు. జగన్ వచ్చి టచ్ చేస్తారా లేక బూతుల మంత్రి ని పంపుతారో తేల్చుకునేందుకు సిద్ధం అని ఆయన సవాల్ చేసారు. పోరంబోకు మంత్రి పోరంబోకు మాటలకు ప్రజలే సమాధానం చెప్తారు  అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బూతుల మంత్రితో పిచ్చి మాటలు మాట్లాడించారు అని ఆయన మండిపడ్డారు.

బాబాయి ని ఎవరు హత్య చేశారో జగన్ ని నిలదీసే ధైర్యం మంత్రికి ఉందా అని ఆయన నిలదీశారు. సిగ్గు శరం ఉంటే తన శాఖకు సంబంధించి రూ.2వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల డబ్బులు రైతులకు ఇప్పించాలి అని ఆయన సవాల్ చేసారు. ఉడత ఊపుళ్ళకు భయపడే జగన్ అమీత్షా కాళ్ళు పట్టుకునేందుకు దిల్లీ వెళ్తున్నారా? అని నిలదీశారు.  జిల్లాలో ఇంత నీచంగా మాట్లాడిన చరిత్ర లేదు  బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నందుకు సిగ్గుపడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కొడాలి నానీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: