పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నందిగ్రామ్ చుట్టే తిరుగుతున్నాయి. తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానన్న సీఎం మమతా బెనర్జీ ప్రకటనతో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
టీఎంసీ అధినేత్రి తాజా  ప్రకటనతో  కొంత కాలంగా సీఎం మమత, సుబేందు మధ్య పరోక్షంగా సాగుతున్న మాటల యుద్ధం  కాస్త ఇప్పుడు ప్రత్యక్ష’ యుద్ధానికి తెర లేచినట్లైంది. తాను నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు సీఎం మమత ప్రకటించిన కొద్ది గంటలకే.. టీఎంసీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సుబేందు భారీ సవాల్ విసిరారు. సీఎం మమతను నందిగ్రామ్ లో 50,000 ఓట్ల మెజార్టీతో ఓడించి తీరుతానని శపథం చేశారు. లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతానని సుబేందు సవాల్ విసిరారు.

   కోల్‌కతాలో జరిగిన  ర్యాలీలో సుబేందు పై మమతకు ఈ సవాల్ చేశారు. ‘‘మమతను 50,000 ఓట్లతో ఓడించి తీరుతా... లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతా’’ అని సుబేందు సంచలన ప్రకటన చేశారు. తృణమూల్ రాజకీయ పార్టీ కాదని, అదో ప్రైవేట్ కంపెనీ అని సుబేందు ఎద్దేవా చేశారు. టీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్‌ను అద్దుకు తెచ్చుకున్నారని, దీన్ని బట్టే బీజేపీ గెలిచిపోతోందని అర్థమైపోతోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడే సీఎం మమతకు నందిగ్రామ్ గుర్తొస్తుందని, ఆమె నందిగ్రామ్ కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.

    బెంగాల్ లోకి  బీజేపీ దూసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమాలకు ఊపిరిలూదిన ‘నందిగ్రామ్’ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. సోమవారం నందిగ్రామ్‌లో జరిగిన ఓ బహిరంగ సభ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. వీలైతే భవానీ పూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఆమె జాదవ్‌పూర్ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు తృణమూల్‌కు, అటు బీజేపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: