నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు  మమత బెనర్జి నేడు (సోమవారం) ప్రకటించారు పశ్చిమ బెంగల్ ముఖ్య మంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చేసిన ఒకే ఒక ప్రకటన ఆ రాష్ట్ర  రాజకీయాలను కీలక, సంచలనాత్మక మలుపు తిప్పిందనవచ్చు రానున్న శాసనసభ ఎన్నికల్లో తానుఈ ప్రకటనతో పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ఒక ప‌బ్లిక్ మీటింగ్‌లో ఆమె ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుబేందు అధికారి బిజెపి పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ది నందీగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఇప్పుడు రాబోయే బెంగాల్ ఎన్నిక‌లు మ‌మ‌తా వ‌ర్సెస్ బిజెపిగా అవ‌త‌రించ‌నున్నాయి.

ఇన్ని రోజుల పాటు సీఎం మమత బెనర్జి, సుబేందు అధికారి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడించింది. ఒకే ఒక్క ప్రకటనతో మమత  ‘ప్రత్యక్ష’ యుద్ధానికి తెర లేపారు తాను నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన కొద్ది గంటలకే బీజేపీ నేత సుబేందు అధికారి భారీ సవాల్ విసిరారు.

సీఎం మమత బెనెర్జిని 50,000 ఓట్ల ఆధిఖ్యతతో ధారుణ ఓటమికి గురిచేసి తీరుతానని శపథం చేశారు. లేదంటే రాజకీయాల నుంచే శాశ్వతం గా వైదొలుగుతానని సుబేందు సవాల్ విసిరారు.

కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో సుబేందు పై వ్యాఖ్యలు చేశారు. “మమతను 50,000 ఓట్లతో ఓడించి తీరుతా... లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతా” అని సుబేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. సుబేందు అధికారి మాట్లాడుతూ తాను గత 21 సంవత్సరాలు మమత బెనర్జి నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో కలిసి ప్రయాణించినందుకు తీవ్రంగా సిగ్గుపడుతున్నానని ఘోషించారు. నాటి క్రమశిక్షణను అధినేత నుండి సామాన్య కార్యకర్త వరకు అందరు వదిలేశారని,  అందుకే ‘రాజకీయ పార్టీ’ రూపాన్ని వదిలేసి ‘ప్రయివేట్ వ్యాపార సంస్థ’ రూపాన్ని సంతరించుకుందని చెప్పారు.

ఈ సందర్బంగా నేటి తృణమూల్ కాంగ్రెస్ అనేది రాజకీయ పార్టీ కాదని, అదోక ప్రైవేట్ వ్యాపార సంస్థ అని సుబేందు అధికారి అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికలలో తన గెలుపు కోసం బీహార్ రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్‌ను అద్దెకు తెచ్చుకున్నారని అంటూ, దీనిననుసరించి చూస్తే మమతలో ఆత్మ విశ్వాసం నశించిందని, తద్వారా యుద్ధానికి ముందే బీజేపీ గెలుపు నిశ్చయమైందని అర్థమైపోతోందని ఆయన పేర్కొన్నారు.

“ఎప్పుడు ఎన్నికలొచ్చినా  సీఎం మమత బెనర్జికి నందిగ్రామ్ గుర్తొస్తుందని, ఆమె నందిగ్రామ్ కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు” నందిగ్రామ్ మమతను ఎన్నటికీ మరిచిపోదని మమతను ఓడించటానికే సిద్ధమయ్యే క్రమంలో నందిగ్రామ్ ఉందని సుభెందు అధికారి నమ్మకంగా చెప్పారు.
మాజీ మంత్రి సుబేందు అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం తమ రాష్ట్రానికి భారత ప్రధాని నరెంద్ర మోడీ గారు విస్తృత మార్గదర్శనం చేయాలని "ప్రస్తుతం తాము పశ్చిమ బెంగాల్ ఇంకా జీవిస్తున్నామంటే దానికి కారణం మహనీయులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగఫలమే" నని ఉద్ఘాటించారు.

ప్రస్తుత దురదృష్టకర రాజకీయ వాతావరణం నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే కేంద్రం రాష్ట్రంలో కూడా బిజేపి అధికారంలోకి తెచ్చు కోవలసిన అవసరం రాష్ట్రాభివృద్ధికి నిరుద్యొగ సమస్య పరిష్కారం అత్యవసరమని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: