పురాణ ఇతిహాసాల గురించి అవహాన ఉన్న వాళ్లకి  శిశుపాలుడు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకూ అతడిని నేను ఏమీ చేయనని కృష్ణుడు తన మేనత్త కు మాట ఇస్తాడు. ఫలితంగా శిశుపాలుడు రోజు రోజుకు చేసే వికృత చేష్టలను, హత్యలను కృష్ణుడు చూసినా కిమ్మనక ఉండేవాడు. అందుకు కారణం 100 తప్పులు జరిగే వరకూ వేచి చూస్తానని తన మేనత్తకు ఇచ్చిన మాటే. చివరికి 101 వ తప్పు చేసే చేయగానే శిరచ్చేదం చేశాడు శ్రీ కృష్ణుడు.
ట్రంప్ ప్రస్తుత పరిస్థితి అచ్చం..అలాగే కనిపిస్తోంది. అక్కడ తల తీశారు..ఇక్కడ పదవి పీకేశారు. రెండిటికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే పరువును తలతో పోల్చి చెప్తారు పెద్దలు. నా తల తాకట్టు పెట్టయినా నీ అప్పు తీర్చుతా అంటే పరువు అని అర్థం. ఇప్పుడు అదే జరిగింది ట్రంప్ విషయంలో. అవడానికి అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ప్రజల మన్ననలు అందుకోవడంలో కానీ, ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ట్రంప్ ఎప్పుడు ప్రజల మనసు చొరగోనలేదు.పైగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకోసం వేయని నాటకాలు, డ్రామాలు లేవు. ఒక పక్క కోర్టులలో కేసులు వేస్తూ, అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా  తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు..ముఖ్యంగా

అమెరికా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడి ఘటన ట్రంప్ ప్రమేయంతో జరిగిందని యావత్ ప్రపంచానికి తెలుసు, అయినా కించిత్ బాధ కూడా లేని ట్రంప్ తన తప్పులను ఒప్పుకోక పోగా తాను ఏ తప్పు చేయలేదంటూ ఎదురు దాడి చేయడం సొంత పార్టీ నేతలకే విసుగు తెప్పిస్తోంది. అందుకే ట్రంప్ పై అభిశంసన విషయంలో సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు కూడా అభిశంసన కు మద్దతు తెలిపారు. ఇదిలాఉంటే. అధ్యక్షుడు వైట్ హౌస్ వీడి వెళ్ళే సమయంలో తాను చేసిన తప్పులను ప్రస్తావించి క్షమాపణలు కోరడం ఆనవాయితీ గా వస్తోంది. అందుకు ట్రంప్ కూడా సిద్దమయ్యారట. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే ట్రంప్ కూడా తాను చేసిన తప్పులు లెక్క గడితే 100 వచ్చాయట. ఇప్పుడు ఈ వంద తప్పులకు ట్రంప్ క్షమాపణలు చెప్పడానికి సిద్దమయ్యారు. అక్కడ శిశుపాలుడి తల నరికితే, ఇక్కడ ట్రంప్ చేసిన తప్పులకు పరువు పోవడమే కాకుండా పదవీ చ్యుతుడు కూడా అయ్యాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: