అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరికొద్దిగంటల్లో పదవి నుంచి తొలగబోతున్నారు. ఆయన స్థానంలో జో బెడన్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ట్రంప్‌కు చైనా అంటే ఎంత కోపమో అందరికీ తెలిసిందే. ఆయన పదవిలో ఉన్నన్నాళ్లూ చైనాపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రత్యేకించి కరోనా సమయంలో ఆ వైరస్ చైనా నుంచే వచ్చిందని బహిరంగంగానే విమర్శించే వారు.. కరోనా వైరస్ ను చైనా వైరస్ అని పిలిచే వాళ్లు.

అయితే ఆయన దిగిపోయే కొన్ని గంటల ముందు చైనాకు లాస్ట్ పంచ్ విసురుతారని వార్తలు వస్తున్నాయి. ఆర్థికంగా చైనాను బలహీనపరిచేందుకు ఉన్న అన్ని అస్త్రాల్ని వాడుతున్నారు. చైనా టెలికాం దిగ్గజం, 5జీ సాంకేతికతకు ప్రసిద్ధి గాంచిన హువావే టెక్నాలజీస్‌పై ట్రంప్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఈ సంస్థ అమెరికాలోని ఇంటెల్‌ సహా మరికొన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు హువావేకు పరికరాలను సరఫరా చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఆ అనుమతుల్ని రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

అంతే కాదు.. ఆ సంస్థ ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరిస్తారట. దాదాపు 150 అనుమతుల్ని ట్రంప్‌ రద్దు చేస్తారట. ట్రంప్ ఇలా చేస్తే హువే య్ సంస్థకు దాదాపు 120 బిలియన్‌ డాలర్లు నష్టం వస్తుందట. అంతేకాదు..హువావేకు అమెరికా నుంచి ఎలాంటి పరికరాలు వెళ్లకూడదని ట్రంప్‌ నిశ్చయంతో ఉన్నారట.  ఈ మేరకు ఆయా కంపెనీలకు అమెరికా వాణిజ్య శాఖ నోటీసులు జారీ చేసింది.

ట్రంప్‌కు ఆ సంస్థపై అంత కోపం ఎందుకంటే..  చైనా సాంకేతికత వల్ల సమాచారం దోపిడీకి గురవుతుందని ఆయన ఫీలింగ్. అంతకుముందు హువావేను బహిష్కరించాలని పాశ్చాత్య దేశాలను కూడా ట్రంప్‌ కోరారు. మొత్తానికి పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన ఆయన చివరి రోజుల్లోనూ చైనాను వదిలిపెట్టడం లేదన్నమాట. ట్రంపా మజాకా అని జనం ఆశ్చర్యపోయేలా చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.. చూడాలి ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: