జనవరి 20.. ఇప్పుడు అమెరికాలో అందరిదృష్టీ ఈ తేదీపైనే ఉంది. అది అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగే రోజు. అమెరికాలో ఈ తేదీ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగినా కొత్త అధ్యక్షుడు జనవరి 20నే ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఇప్పుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితంగా జరగబోతోంది. ఎందుకంటే.. మొన్నటి కాపిటల్ భవనంపై దాడి దృష్ట్యా భద్రత మరింత కట్టుదిట్టు చేశాం.



షాకింగ్ న్యూస్ ఏంటంటే.. జో బైడన్‌కు భద్రతా దళాల నుంచే ముప్పు ఉందని వస్తున్న సమాచారం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. భద్రతలో పాల్గొనే సిబ్బందే దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు రావడంతో రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతే కాదు.. అంతర్గత దాడులు జరుగుతాయన్న అంచనాలు ఉన్నా, విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బందే తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీన్ టెన్షన్ టెన్షన్‌ గా మారింది.



ట్రంప్ సంగతి తెలిసిందే.. మొన్నటి క్యాపిటల్ భవనంపై వారు చేసి దాడి అమెరికా చరిత్రలోనే చీకటి ఘట్టంగా చెబుతున్నారు. మరోసారి అలాంటి దాడి జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే కనీవిని రీతిలో భద్రత బలగాలను మోహరించారు. వాషింగ్టన్ డీసీ నగరాన్ని మిలటరీ కంటోన్మెంట్‌గా మార్చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25వేల మంది నేషనల్‌ గార్డులను రప్పించి భద్రత కల్పిస్తున్నారు. వీరికి తోడు వేల సంఖ్యలో స్థానిక పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు. అయితే విపరీత భావజాలం ఉన్న సైనికులే దాడి చేయొచ్చని సమాచారం రావడంతో సిబ్బంది అందర్నీ తనిఖీ చేస్తున్నారు. నిఘా సంస్థ ఎఫ్‌బీఐ మరింత అప్రమత్తంగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: