ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు రోజుకోర‌కంగా ఉడికిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా  గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన క‌ర‌ణం బ‌ల‌రాం.. నియోజ‌క‌వ‌ర్గంలో పైచేయి సాధించేందుకు నిత్యం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా ర‌గ‌డ‌కు దిగుతున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగా వైసీపీ నాయ‌కుల‌తో కాలుదువ్వుతున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌రీముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. పై పైచేయి సాధించేందుకు క‌ర‌ణం చేయ‌ని జిమ్మిక్కులు లేవంటే అతిశ‌యోక్తికాదు. ఈ క్ర‌మంలో ఆమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో వివాదాలు స‌ర్వ సాధార‌ణ‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఆమంచి దూకుడు ఎలా ఉంది? ఆయ‌న గ్రాఫ్ ఏమైనా త‌గ్గిందా?  ఆయ‌న వ్యూహానికి ఇబ్బంది ఏమైనా ఉందా? క‌ర‌ణం పైచేయి సాధించాడా? అనే అంశాల‌పై ఇటీవ‌ల ఆన్‌లైన్ మీడియా ఒక‌టి స‌ర్వే చేసింది. ఇటీవ‌ల కాలంలో స‌ర్వేలు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణమే అయిన నేప‌థ్యంలో ఈ స‌ర్వేకు కూడా ప్రాధాన్యం పెరిగింది. చీరాల ప్ర‌జ‌లు బాగానే స్పందించారు. దీనిని బ‌ట్టి.. ఆమంచికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ క‌నిపించింది. మాస్‌లో ఇప్ప‌టికీ ఆమంచిని ఫాలో అయ్యేవారే ఎక్కువ‌గా ఉన్నారు. వాస్త‌వ‌నికి క‌ర‌ణం రాక‌తో.. ఆయ‌న కుమారుడు వెంక‌టేష్‌.. వైసీపీలోకి చేరిపోయాడు. అయిన‌ప్ప‌టికీ.. యువ‌త మాత్రం ఆమంచి వెంటే ఉన్నారు.

నిజానికి వెంక‌టేష్ యువ నాయ‌కుడు క‌నుక .. యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, వెంక‌టేష్ వ్య‌వ‌హార‌శైలి తో ఎవ‌రూ స‌రిప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఒంటరి అయ్యాడు. ఇక, మాస్ మ‌హారాజ్‌గా ఆమంచి నిలిచారు. మ‌హిళ‌ల ద‌గ్గర నుంచి యువ‌త వ‌ర‌కు అంద‌రూ కూడా ఆమంచి వైపే ఉన్నార‌నే విష‌యం తాజా స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. అంతేకాదు.. త‌మ‌కు ఏదైనా చేయాల‌ని అంటే.. మ‌ళ్లీ ఆమంచి రావాల్సిందే.. గెల‌వాల్సిందే.. అనే యువ‌త కూడా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

``గ‌త ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో తెలీదు.. కానీ, ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. గెలుపు మాత్రం ఆమంచి సార్‌దే.!`` అంటున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ఘ‌ర్ష‌ణ‌ల విష‌యంలో ఎవ‌రూ ఆమంచిని త‌ప్పుప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు..ఆయ‌న త‌ప్పు ఏమీ లేద‌ని.. ఎవ‌రైనా రెచ్చ‌గొడితే.. పిల్లి మాత్రం ఊరుకుంటుందా? అని ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇదీ చీరాల ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: