ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఒక్కో దేశంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతోంది. చాలా దేశాలు త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు క్ర‌మ‌క్ర‌మంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌న్న నిర్ణ‌యానికి రాగా.. కొన్ని దేశాల్లో టీకా విక‌టిస్తోన్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. తాజాగా నార్వే దేశంలో ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతిచెందారు. దీంతో ఈ ఫైజ‌ర్ వ్యాక్సిన్‌పై ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డా లేని ఆందోళ‌న నెల‌కొంది. అయితే ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ ఫైజ‌ర్ వ్యాక్సిన్ ను ఏకంగా 10 మిలియ‌న్ డాల‌ర్ల డోసుల‌కు ఆర్డ‌ర్ చేసింది.

ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ టీకాపై ఎక్క‌డా లేని తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఈ టీకా గురించి నార్వే వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఇటు ప్ర‌భుత్వంతో చ‌ర్చించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నార్వేలో 23 మంది మృతి చెంద‌డానికి కార‌ణం.. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వృద్ధుల్లో ఎక్కువ మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డ‌మే అని చెపుతున్నారు. అయితే యూరోపియ‌న్ మెడిక‌ల్ ఏజెన్సీల అధికారులు చెపుతోన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే వ్యాక్సినేష‌న్ వేసే స‌మ‌యంలో భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో అన్నది గుర్తుంచుకోవాలి.

నార్వేలో క‌రోనా టీకా వేయించుకున్న వారిలో 23 మంది తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యి వెంట‌నే మృతి చెందారు. దీంతో నార్వే ప్ర‌భుత్వం దీనిపై విచార‌ణ‌కు ఆదేశించ‌గా.. అక్క‌డ అధికారులు రంగంలోకి దిగి ? వ‌్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఏం జ‌రిగింది ?  అనే దానిపై ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ చ‌నిపోయిన వారంద‌రూ వృద్ధులే అని.. వారికి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండడంతోనే మృతి చెందార‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలిన‌ట్టు స‌మాచారం.

ఇక వ్యాక్సిన్ వేయించుకుంటోన్న వారిలో చాలా మందికి తీవ్ర‌మైన జ్వ‌రంతో పాటు వాంతులు, విరేచ‌నాల వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ట‌. ఏదేమైనా ఫైజ‌ర్ వ్యాక్సిన్ డోసులు వేయించుకున్న వారిలో ఎక్క‌వ మ‌ర‌ణాలు ఉండ‌డంతో ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌కు ఆర్డ‌ర్లు ఇచ్చిన దేశాల్లో ఆందోళ‌న నెల‌కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: