తెలంగాణ‌లో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్‌కు గ‌ట్టి ప‌ట్టున్న ఆంధ్రా మూలాలు ఎక్కువుగా ఉండి.. ఆంధ్రాతో స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలుపు కంటే వాపుతోనే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఒక్క ఖ‌మ్మం సీటు మాత్ర‌మే గెలుచుకుంది. త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మార‌డంతో బ‌లం పుంజుకుని ఖ‌మ్మంతో పాటు జిల్లాలో స‌గం ఉన్న మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. ఆ త‌ర్వాత జిల్లాలో గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి.

ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజ‌య్ హ‌వా పెరిగిపోయింది. దీంతో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అస‌లు వీరిద్ద‌రికి ఎలాంటి ప్రాధాన్య‌త లేకుండా పోయింది. ఇక కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ్యాన‌ర్ల‌ను కూడా రాత్రికి రాత్రే తొలిగించారు. ఈ క్ర‌మంలోనే తుమ్మ‌ల‌తో పాటు పొంగులేటిపై బీజేపీ క‌న్నేసింద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఇక రోజు రోజుకు వీరికి ఏ మాత్రం ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో పొంగులేటి ఫైర్ అయ్యారు. త‌న బాధ‌ను ఓపెన్‌గానే చెప్పేశారు. పార్టీలో త‌న‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని చెప్ప‌డంతో పాటు క‌నీసం త‌న అనుచ‌రుల‌కు కూడా గుర్తింపు లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం నేరుగా కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీం‌తో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ర‌మ్మ‌ని పొంగులేటికి కాల్ చేసిన‌ట్టు తెలియ వ‌చ్చింది. ఇక అసంతృప్తితోనే ఉన్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో సైతం మంత్రి పువ్వాడ అజ‌య్‌తో పాటు ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు భేటీ అయ్యారు.

ఇక తుమ్మ‌ల‌పై పాలేరులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చాక తుమ్మ‌ల‌ను పూర్తిగా సైడ్ చేసేశారు. దీంతో జిల్లాలో ఒక‌ప్పుడు కీలకంగా ఉన్న పొంగులేటి, తుమ్మ‌ల సైలెంట్ అయితే పార్టీకి ఎఫెక్ట్ అని భావించిన కేటీఆర్‌.. వీరిద్ద‌రికి ఏవో నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చి వారిని శాంతిప‌జేసే బాధ్య‌త‌ను తీసుకున్నార‌ని టాక్ ? 

మరింత సమాచారం తెలుసుకోండి: