ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి జనసేన పార్టీ నేతలు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. బిజెపి జనసేన పొత్తు తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ నేతలు ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కూడా జనసేన పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక విమర్శలను కూడా కాస్త గట్టిగానే చేస్తున్నారు. తాజాగా జనసేన పిఎసి కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టులు చేసి భయపెడదామనుకొంటున్నారా అని ఆయన నిలదీశారు.

జనసేన కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికం అని మండిపడ్డారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న  విగ్రహాలను ధ్వంసం ఘటనలపై సక్రమరీతిలో దర్యాప్తు చేయించలేని ప్రభుత్వం  అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో ఆ ఘటనలపై పోస్టులు పెట్టారనే నెపంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గు‌చేటు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్  పై కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే ముందుగా వైసీపీ పార్టీ వాళ్ళనే జైళ్లకు పంపించాలి అని అన్నారు. వ్యవస్థల పైనా, వ్యక్తుల పైనా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న దుష్ప్రచారం ఆ పార్టీ పైశాచికత్వాన్ని తెలుపుతున్నాయి అని మండిపడ్డారు.

గౌరవ హైకోర్టు, గౌరవ న్యాయమూర్తులపై వారు చేసిన సోషల్ మీడియా పోస్టింగులు వైసీపీ ఆలోచనా విధానాన్ని తెలుపుతాయి అని అన్నారు. ఆ విధమైన దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ పోలీసు శాఖ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. అంటే ఆ శాఖను పాలకులు ఎలా గుప్పిట పెట్టుకొని ఆడిస్తున్నారో అర్థం అవుతుంది అని మండిపడ్డారు. తక్షణమే జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: