పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తోన్న వేళ అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అధికార టీఎంసీ వ్యూహాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెట్టేందుకు బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎంఐఎం పార్టీ అక్క‌డ పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే టీఎంసీ అస‌దుద్దీన్ వ్యూహాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెట్టేలా వాళ్ల వ్యూహాలు, క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచింది. 294 అసెంబ్లీ సీట్లు ఉన్న బెంగాల్లో గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డంతో పాటు 122 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేసే స్థాయికి వ‌చ్చేసింది. ఈ లెక్క‌లు చూస్తే బీజేపీ మామూలుగా పుంజుకోలేదనే చెప్పాలి.

బెంగాల్లో కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎక్కువ సంఖ్య‌లో ఉన్న మైనార్టీలు అంద‌రూ మ‌మ‌త‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఎంఐఎం పోటీ చేస్తే మైనార్టీ ఓట్ల‌కు గండి ప‌డ‌డంతో పాటు ఆ ఎఫెక్ట్ టీఎంసీపై బాగా ప‌డి బీజేపీకి బాగా ప్ల‌స్ అవుతుంది. దీంతో అంద‌రూ బీజేపీకి ఎంఐఎం బీ టీం అంటూ చ‌ర్చించుకుంటోన్న టైంలో ఇప్పుడు శివ‌సేన బీజేపీకి షాక్ ఇచ్చింది. తాము బెంగాల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘ‌టితం చేసుకుని... తాము తిరుగులేకుండా ఎద‌గ‌వ‌చ్చ‌ని భావించిన బీజేపీకి శివ‌సేన ప్ర‌క‌ట‌న పెద్ద షాకే అని చెప్పాలి.

హిందువుల ఓట్ల‌లో 1 శాతం చీల్చినా బీజేపీ పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. ఎంఐఎం బీజేపీకి ‘బి’ టీమ్ అయితే.. టీఎంసీకి శివసేన కూడా ‘బి’ టీమ్ లాగే పనిచేస్తుందని అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. ఆ మాట‌కు వ‌స్తే 2019 ఎన్నిక‌ల్లోనే శివ‌సేన బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఆ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొంది. అయితే ఇప్పుడు బీజేపీ వ‌ర్సెస్ శివ‌సేన మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. ఈ టైంలో బెంగాల్లో బీజేపీని దెబ్బ‌కొట్టేందుకు శివ‌సేన అక్క‌డ డైరెక్ట్ ఫైట్‌కు రెడీ అవుతోంది.

శివ‌సేన‌కు బెంగాల్లో సీట్లు రాక‌పోయినా.. హిందూ ఓటు బ్యాంకును కొంత వ‌ర‌కు అయినీ చీలిస్తే ఆ ప్ర‌భావం బీజేపీపై ఖ‌చ్చితంగా ఉంటుంది. దీంతో బీజేపీలో ఇప్పుడు కొత్త గుబులు మొద‌లైంది. మ‌రి ఎంఐఎంను టీఎంసీ.. శివ‌సేన‌ను బీజేపీ ఎలా ఎదుర్కొంటాయో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: