అతను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్.. ఇక విధి నిర్వహణలో ఎంతో ధైర్యం గా నేరస్థులను పట్టుకున్నారు.. ఎన్నో రోజుల పాటు పోలీసు వృత్తిలో కొనసాగారు.. అయితే ధైర్య సాహసాలకు మారు పేరైన ఆ పోలీస్ కు ఏం కష్టం వచ్చిందో.. చివరికి మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుడివాడ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తాను నివాసం ఉండే అపార్టుమెంటులోనే  ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.


 అయితే గుడివాడ ఎస్ఐ విజయ్ కుమార్ కి రెండు నెలల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా భార్యను కాపురానికి తీసుకు రాలేదు. అంతలో  విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇక విచారణ మొదలు పెట్టారు. అయితే ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణం అనే అనుమానాలు కూడా మరో వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి.



 గతంలో హనుమాన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళతో విజయ్ కుమార్ కి వివాహేతర సంబంధం ఉంది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయంపై సస్పెండ్ కూడా అయ్యాడట ఎస్ఐ విజయ్ కుమార్.  ఇక గత మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన మహిళతో పెళ్లి జరుగగా భార్య ను కాపురానికి తీసుకు రాకుండా.. గుడివాడలో గతంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తోనే  కలసి ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇక ప్రియురాలు ఒత్తిడి వల్లనే విజయ్ కుమార్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వివిధ కోణాలలో కేసును విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: