తెలంగాణాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్ధవంతంగా జరుగుతుంది. ఈ నెల 16 నుంచి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలయింది. దీనిపై మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ నెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ రాష్ట్రంలో దిగ్విజయంగా కొనసాగుతుందని అని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని మంత్రి స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిర్వహణ పై  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి  మహమ్ముద్ అలీ, కలెక్టర్ శ్వేతా మహంతి , గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ లోకేష్ కుమార్,  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, డీ ఎం హెచ్ ఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్  హైదరాబాద్ లో ఉన్న మెడికల్ అండ్ హెల్త్ , పోలీస్ , జీహెచ్ఎంసీ అధికారులను , సిబ్బంది ని వ్యాక్సిన్ ప్రక్రియ ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి  కీలక వ్యాఖ్యలు చేసారు. హైద్రాబాద్ లోని 140 సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ బ్రహ్మాండంగా కొనసాగుతున్నది అని ఆయన వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న దుష్ప్రచారాన్ని ప్రజలెవరు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. 16 తారీఖున ప్రారంభమైన వ్యాక్సిన్ ప్రక్రియ వల్ల నేటి వరకు ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు  తలెత్తలేదని ఆయన వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల్లో విధులు నిర్వహించిన వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బందికి మొదటగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ అధికారులు మొదటి విడతగా 22 వేల 7వందల 32 మందికి ప్రతి సెంటర్లలో 50 మందికి అందించనున్నారని ఆయన తెలిపారు. పేద్ద ఆసుపత్రిలు అయిన గాంధీ, ఉస్మానియా, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, నిమ్స్ లలో 150నుండి 200 వందల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: