నందిగ్రామ్ నుంచి తాను ఈసారి బ‌రిలోకి దిగుతాన‌ని మ‌మ‌త బెన‌ర్జీ వ్యాఖ్య‌నించ‌డంపై స్థానిక ఎమ్మెల్యే సువెందు ప్ర‌తిస‌వాల్ విసిరారు. నిజంగానే మ‌మ‌త‌కు అంత ధైర్యం ఉంటే మాట మీద నిల‌బ‌డి నందిగ్రామ్ నుంచి బ‌రిలోకి దిగాల‌ని అన్నారు.తాను నందీగ్రామ్‌లో మమతను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. 50వేల‌కు పైగా మెజార్టీ  సాధిస్తాన‌ని, అలా చేయ‌కుంటే కూడా తాను ఓడిపోయిన‌ట్లుగానే భావించి రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా నిష్క్ర‌మిస్తాన‌ని చెప్పారు. సువెందు ప్ర‌తిస‌వాల్‌తో ఇప్పుడు బెంగాల్ రాజ‌కీయాలు మ‌రింత వేడిక్కాయ‌నే చెప్పాలి. సోమ‌వారం నందిగ్రామ్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో రాష్ట్రముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తాను ఈ సారి ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని ల‌క్ష‌లాది మంది ప్ర‌జల స‌మ‌క్షంలో వెల్ల‌డించారు.


దీంతో ఇటీవలే మమతపై తిరుగుబాటు ప్రకటించి బీజేపీలో చేరిపోయిన సువెందు ఒంటికాలుపై లేచి సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ కోల్‌కతాలో జరిగిన బహిరంగ సభలో సువెందు అధికారి మాట్లాడుతూ టీఎంసీ ఒక పార్టీ కాదని అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అన్నారు. ఎన్నికలప్పుడే మమతకి నందిగ్రామ్ గుర్తుకొచ్చిందని విమర్శించారు. నందిగ్రామ్ కి మమత ఏం చేసిందని ప్రశ్నించారు. టీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్‌ను అద్దుకు తెచ్చుకున్నారని, దీన్ని బట్టే బీజేపీ గెలిచిపోతోందని అర్థమైపోతోందని ఆయన పేర్కొన్నారు. కాగా,ప్రస్తుతం భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.



తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక నేత సువేందు అధికారి.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భవానీపుర్‌ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.పదేళ్ల క్రితం అధికారం వామపక్షాల నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు రావడానికి కారణం నందిగ్రామ్ ఘటనే. 2007లో నందిగ్రామ్‌లో సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మరణించారు. వామపక్షాలపై మమతా బెనర్జీ.. అమ్మ, మట్టి, మనుషులు అనే నినాదాలను ఎక్కుపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందిగ్రామ్‌ ప్రాంతంలో సువేందు అధికారి కుటుంబానికి గట్టి పట్టుంది. అలాంటి నేత ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. మళ్లీ నందిగ్రామ్‌ నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: