ఇక ప్రయాణికులు అందరికీ ట్రాఫిక్ కష్టాన్ని తగ్గించడమే కాదు ఎంతో సులువైన ప్రయాణాన్ని కలిగించేందుకు..  ఔటర్  రింగ్ రోడ్డు నిర్మించారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఔటర్  రింగ్ రోడ్డు ప్రయాణం భారాన్ని తగ్గించడం ఏమో కానీ ప్రమాదా లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. సాధారణంగా హైవేలపై వెళ్తున్న వాహనదారులు ఎక్కువగా ట్రాఫిక్ ఉండడంతో..  ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒక లిమిట్ స్పీడ్ తో మాత్రమే వెళుతూ ఉంటారు. కానీ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇక తమకు నచ్చిన విధంగా హై స్పీడ్ తో దూసుకుపోతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వాహనం పై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు.  దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొన్ని తెరమీదికి వస్తూ ఉంటే..మరికొన్నిసార్లు వాహనదారులు జీవచ్ఛవాలుగా మారుతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హై స్పీడ్ తో వెళ్లే వాహనదారుల వేగానికి కళ్లెం వేసేందుకు అటు అధికారులు ఎప్పటికప్పుడు కీలకంగా నిర్ణయాలు తీసుకుని  చర్యలు చేపడుతున్నారు అనే విషయం తెలిసిందే.



 ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్ణీత స్పీడ్  కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్లిన వారికి భారీ జరిమానాలు విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇకపై ఔటర్ రింగ్ రోడ్డు పై వాయువేగంతో వెళ్లారు అంటే ఇక జరిమానాల మోత మోగనుంది.  ఇకపై నిర్దేశిత లైన్  లోనే నిర్దేశిత వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డుపై గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్ల నిర్ణయించారు. అంతకుముందు ఈ వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉండేది. ఔటర్ రింగ్ రోడ్డుపై మొదటి రెండు వరుసల్లో వెళ్లే  వాహనదారులు100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు చివరి రెండు వరుసల్లో వెళ్లే వాహనదారులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి. నిబంధనలు అతిక్రమిస్తే 1100 జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

orr