ఈ మధ్య కాలంలో రోడ్డు నిబంధనల ను అతిక్రమించడం అన్నది సర్వ సాధారణం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. అయితే రోడ్డు నిబంధనలు అతిక్రమించడం కారణం గా రోడ్డు ప్రమాదాలు జరిగి  ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు... అందుకే రోడ్డు నిబంధనలు పాటించి  ప్రాణాల ను కాపాడుకోవాలి అని అధికారులు ఎన్ని సార్లు అవగాహన కార్య క్రమాలు చేపట్టినప్పటికీ వాహన దారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.  అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా వాహన దారులు రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తూ  ఉన్నారు.



 ఈ క్రమం లోనే రోడ్డు నిబంధన లను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారకులుగా మారిపోతున్న ఎంతో మంది వాహన దారుల  భరతం పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కఠిన నిబంధనలు అమలు లోకి తెస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇక కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కఠిన నిబంధనల కారణంగా..  ఒక్కసారి పోలీసులకు దొరికారు అంటే వాహనదారుల జేబుకు చిల్లు పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జరిమానా లకు భయపడి ఎంతోమంది వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలుపాటిస్తూ వాహనాలు నడుపుతున్నారు.



 ఈ క్రమంలోనే మరోసారి వాహనదారులు అందర్నీ కూడా రోడ్డు నిబంధనలు పాటించే విధంగా చేసేందుకు మరో కొత్త రూల్  కేంద్రం త్వరలో అమలులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ కూడా రెండేళ్ల వరకూ నిబంధనల అతిక్రమణ ను పరిగణలోకి తీసుకుంటారు.  ఒకవేళ రెండేళ్లలో  నిబంధనలు మీరితే ఇక ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే సమయంలో ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేంద్రం ఈ కొత్త రూల్ అమలులోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది.  ముందుగా ఈ కొత్త రూల్  దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: