పాకిస్థాన్‌లోని సింద్ ఫ్రావిన్స్‌లో భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జేజేలు ప‌లికారు. మోదీజి జిందాబాద్ అనే నినాదాలు హోరెత్తాయి. మ‌తన్మోదంతో ఉగ్ర‌వాదాన్ని పెంచి పొషిస్తున్న పాకిస్థాన్ నుంచి త‌మ‌కు విముక్తి ప్ర‌సాదించాల‌ని కోరుతూ  సింధ్‌ ప్రావిన్స్‌లో ఉన్న సాన్‌ పట్టణ ప్రజలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో భారత ప్రధాని మోదీ పోస్టర్లను ప్రదర్శించారు. పాక్‌ నుంచి విడిపోయి సొంత దేశంగా ఆవిర్భవించేలా జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, సౌదీ అరేబియా రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కెల్‌ తదితర విదేశీ నేతల చిత్రాలతో కూడిన పోస్టర్లనూ ప్రదర్శించారు.తమ రాష్ట్రం ఇండస్-వ్యాలీ నాగరికతకు, వేదిక్ రిలిజిన్ కి ప్రతీక అని, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని 1947 లో పాక్ కు అప్పగించిందని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.


సింధీలకు ప్రత్యేక దేశం..సింధు దేశ్ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. 1967 లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు. పాకిస్థాన్  ప్రభుత్వం, సైన్యం కారణంగా సింధ్ వాసులు ఎన్నో వేధింపుల బారిన పడుతున్నారని ప్రొటెస్టర్స్ పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ప్రజలు కూడా దాదాపు ఇదేవిధమైన ఆరోపణలు చేస్తున్నారు.  ఈ రాష్ట్రం నుంచి అనేకమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు పాక్ కు భయపడి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు. వాస్త‌వానికి సింద్ ఉద్య‌మానికి ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. పాకిస్థాన్ నుంచి త‌మ‌కు విముక్తి క‌లిగించాల‌ని కోరుతూ ఉద్య‌మిస్తున్నారు.


 ప్ర‌త్యేక సింధ్ దేశం కోసం ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవ‌కాశం దొరికినప్పుడ‌ల్లా ఈ అంశాన్ని ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై లేవ‌నెత్తుతూనే ఉన్నారు. పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని ఆక్ర‌మించింద‌ని, త‌మ వ‌న‌రుల‌ను దోచుకుంటూ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పుడుతున్న‌ద‌ని సింధ్ ప్రాంతానికి చెందిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉగ్ర‌వాద దేశ‌మైన పాకిస్థాన్ నుంచి త‌మ‌కు విముక్తి క‌ల్పించాలంటూ ప్ర‌త్యేక సింధూదేశ్ కోసం ఈ ప్రాంత ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.ఘ‌న‌మైన సింధూ లోయ నాగ‌రిక‌త‌కు పేరుగాంచిన సింధ్ ప్రాంతాన్ని మొద‌ట బ్రిటీష‌ర్లు అక్ర‌మంగా ఆక్ర‌మించార‌ని, ఆ త‌ర్వాత దుష్ట ఇస్లామిక్ దేశ‌మైన పాకిస్థాన్‌కు ధారాద‌త్తం చేశార‌ని ఆందోళ‌న‌కారులు ఆరోపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: