తిరుపతి ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందితే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పార్టీని బ్రతికిస్తారు అని కార్యకర్తలు ఎక్కువగా నమ్మే వాళ్ళు.

కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు అనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు విషయంలో అనేక అనుమానాలు కీలక నేతలకు కూడా ఉన్నాయి. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు నమ్మకం లేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనే ఆవేదన కూడా కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే విషయంలో కూడా ఘోరంగా వెనకబడి ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉంటుంది. స్థానిక నాయకులతో అలాగే పార్టీ కేడర్ తో ఎక్కువగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు స్థానిక నాయకులు గానీ పార్టీ క్యాడర్ గాని ఎక్కడా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. రాయలసీమ జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఎదుర్కొని ముందుకు వస్తే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అనేది తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలకు కార్యకర్తలకు ప్రధానంగా ఉన్న ఆవేదన. అందుకే బయటకు రావాలని భావించిన సరే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: