ఏపీలో ఇపుడు సార్వత్రిక  ఎన్నికలు అర్జంటుగా లేకపోయినా యుధ్ధం మాత్రం సాగిపోతోంది. స్థానిక‌ ఎన్నికలకు ఇంతలా హడావుడి పడిన సందర్భం గతంలో లేదు. అలాగే తిరుపతి లోక్ సభ లాంటి ఉప ఎన్నికలు కూడా గతంలో ఎన్నో జరిగాయి. కానీ ఎపుడూ కూడా ఎన్నికల ముందు నుంచే ఇంతటి వేడి వాడి వాదాలు, వివాదాలూ అసలే  లేవు. అదేంటో ఏపీలో 2019 ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తరువాత నుంచి రాజకీయం అలా రాజుకుంటూనే ఉంది.

అదిపుడు కొత్త రూపు తీసుకుంటోంది. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ విపక్షంలో ఉన్నాయి. అయితే చంద్రబాబుని వెనక్కి నెట్టి రెండవ ప్లేస్ లోకి దూసుకువచ్చేయడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏపీలో తామే ముందుంటే జనాలు కూడా వైసీపీకి ఆల్టర్నేషన్ గా తమమే గుర్తిస్తారు అన్నది కమలనాధుల ఆతృత. అందుకే రధ యాత్రకు కూడా సిధ్ధపడిపోతున్నారు.

అయితే ఏపీలో బీజేపీకి ఇప్పట్లో  అధికారం దక్కడం కష్టమని వైసీపీ మంత్రి కొడాలి నాని జోస్యం చెబుతున్నారు. యూపీలో 1990 ప్రాంతంలో బీజేపీ రధ యాత్ర చేస్తే అక్కడ అధికారంలోకి రావడానికి 27 ఏళ్ళు పట్టిందని, ఇక ఏపీలో బీజేపీ నేతలు ఇపుడు రధయాత్ర అంటూ మొదలెట్టారని, మరో మూడు దశాబ్దాల తరువాత బీజేపీకి అధికారం వస్తుందో రాదో తేలుతుందంటూ కొడాలి నాని తాజాగా  చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. మొత్తానికి 2024లోనే అధికారంలోకి రావడానికి బీజేపీ  ఆరాటపడుతూంటే కొడాలి నాని మాత్రం మూడు దశాబ్దాల కాలం ఆగాలంటే కమలం కమిలిపోదా. మరో వైపు సౌత్ మీద బీజేపీ కేంద్ర పెద్దలు కూడా దృష్టి పెట్టి ఉన్నారు. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. దానికి తగినట్లుగా ఏపీ బీజేపీ నేతలు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంటున్నారు. మరి ఏపీలో బీజేపీ పవర్ లోకి ఇప్పట్లో రాదంటే పార్టీ కార్యకర్తలకు కూడా కష్టంగానే ఉంటుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: