ఇస్లామాబాద్: ప్రపంచ దేశాలన్నీ 90 శాతం పైగా పనిచేసే వ్యాక్సిన్లు వినియోగిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం విచిత్రంగా కనీసం 80 శాతం కూడా ప్రభావం చూపని చైనా వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చింది. అయితే అంతకుముందు తాము ఎటువంటి వ్యాక్సిన్లకూ ఆర్డర్లు ఇవ్వలేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వం.. ఎట్టకేలకు చైనా నుంచి వ్యాక్సిన్లను ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాక్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ పాకిస్తాన్(డీఆర్‌ఏపీ) ప్రకటించింది.

చైనా ప్రభుత్వ సంస్థ తయారు చేసిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌ డోసులను పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రజలకు అందించేందుకు చైనా వ్యాక్సిన్‌కు భారీ మొత్తంలో ఆర్డర్ చేశామని పాకిస్తాన్ డీఆర్‌ఏపీ పేర్కొంది. చైనా నుంచి వ్యాక్సిన్‌లు రాగానే వాటిపై పూర్తి నిఘా ఏర్పాటు చేస్తామని, ప్రజలందరికీ అందజేస్తామని వెల్లడించింది. ప్రతి 3 నెలలకి ఒకసారి వ్యాక్సిన్‌ల నిల్వ, భద్రత, సామర్థ్యం, ప్రభావాలపై ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది.  

దీనిపై పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ మాట్లాడుతూ, అనేకమంది వ్యాక్సిన్ తయారీదారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అయితే చైనాతో చేసుకున్న కాన్సినో బయోలాజిక్స్ ఇన్‌కార్పొరేషన్ నుంచి కోట్ల డోసుల వ్యాక్సిన్లు పాకిస్తాన్‌కు అందనున్నాయని పేర్కొన్నారు.  

ఇదిలా ఉంటే భారత్‌లో 16వ తేదీ నుంచి మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. స్వదేశీ వ్యాక్సిన్లయిన కోవీషీల్డ్‌, కొవ్యాగ్జిన్‌లను ప్రజలకు అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. తొలి విడతా 3 కోట్ల మందికి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ 3 కోట్లమందిలో ఫ్రంట్‌లైన్ వారియర్లయిన వైద్య, ఆరోగ్య సిబ్బంది, శానిటైజేషన్ వర్కర్లు, పోలీసులు ఉంటారని తెలిపింది. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే లక్షల మందికి విజయవంతంగా వ్యాక్సిన్‌ డోసులను అందజేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: