హై డ్రామాల మధ్య దేవినేని ఉమాను పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు మాజీ మంత్రి దేవినేని ఉమా వర్సెస్ మంత్రి కొడాలి నానీగా పరిస్థితి మారింది. నిన్న కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే గొల్లపూడి లో దీక్ష చేయడానికి దేవినేని ఉమా వెళ్ళారు. ఆయన అరెస్ట్ చేసి... పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కి ఉమాని తరలించారు. ఆయన అక్కడ ఉన్నారు అనే సమాచారం తెలుసుకుని భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచే అవకాశం ఉందని అంటున్నారు. ఉమా పై కేసు నమోదు చేయాలా..లేదా అనే అంశంపై పోలీసుల తర్జనభర్జన  పడుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న పోలీసులు... ఒకవేళ కేసు నమోదు చేస్తే ఈ రోజు రాత్రి స్టేషన్లో ఉంచి, రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై మాజీ సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా?  అని నిలదీశారు. జగన్‌ ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. అదుపులోకి తీసుకున్న తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టు ముమ్మాటికీ అక్రమమే అని అన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా.? అని నిలదీశారు. భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై చర్యలేవీ.? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు పౌరహక్కుల ఉల్లంఘనే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావం జగన్‌రెడ్డిది అని మండిపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిపోయింది అని ఆరోపించారు. నిన్న నెల్లూరులో ఒక ఎమ్మెల్యే జిల్లా ఎస్పీని బహిరంగంగా బెదిరించాడు అని, నేడు ఇంటికొచ్చి కొడతామంటూ ఓ మంత్రి బెదిరిస్తున్నడు అని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రోద్భలంతో వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బూతుల మంత్రి వీరంగం అని ఆయన ఆరోపణలు చేసారు. అరెస్టు చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. మంత్రి కొడాలి నానీ, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: