కేరళ మలప్పురం జిల్లాలోని పండిక్కడ్ ప్రాంతంలోని కుగ్రామం అది. గత ఐదు సంవత్సరాలు, పలుదఫాలు ఒక 17 యేళ్ళ బాలికపై 38 మంది మృగాళ్ళమూక జరిపిన, జరుపుతున్న అత్యాచార అఘాయిత్య సంఘటన వినటానికే ఒళ్ళు గగుర్పాటుకు గురౌతుంది. ఈ కేసులో మలప్పురం పోలీసులు తాము ఇప్పటి వరకు 32 కేసులు పెట్టి 44 మందిని అరెష్ట్ చేసినట్లు చెపుతున్నారు. 


మలప్పురం పోలీస్ చీఫ్, చెప్పిన ప్రకారం తనతల్లితో పండిక్కడ్ గ్రామంలో ఒక చిన్న కాలనీలో నివాసముంటున్న మైనర్ బాలిక 2015 లో, తప్పిపోవటంతో తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు నాడు కేసు రిజిస్టర్ అయిందని, తన స్నేహితురాలితో ఆ బాలిక ఇల్లు వదలిపోగా పోలీసులు వెదకి పట్టుకొని తిరిగి తల్లి దగ్గరికి చేర్చినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా రెండు “పోస్కో” కేసులు కూడా పెట్టారు.  మరల 2017 లో కుటుంబ పిర్యాదు మేరకు ఇలాంటి కేసే మరొకటి పెట్టటం జరిగిందని అన్నారు. ఈ కేసులన్ని జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నట్లు ఆయన తెలిపారు.  


చివరగా గత డిసెంబర్ లో మరోసారి బాలిక కుటుంబం అమెను తన ఫ్రెండ్ మోటార్ బైక్ పై తీసుకెళ్ళారని తరవాత తిరిగి రాలేదని కేసు నమోదు చేయటంతో, మైనరైన ఈ బాలికను మరోసారి వెతికి పట్టుకొని న్యాయస్థానంలో “స్టేట్మెంట్ రికార్డు"  కోసం ప్రవేశపెట్టారు. ఈసారి బాలిక, ఇచ్చిన సమాచారం ప్రకారం 15 సార్లు తనపై అత్యాచార ప్రయత్నాలు జరగగా తను ప్రతిఘటనతో పలుమార్లు తప్పించుకోగా రెండు సార్లు మాత్రం తాను అత్యాచారనికి గురయ్యానని ఆ బాలిక ఆక్రోశించింది . విషయాన్ని అర్ధం చేసుకున్న పోలీసులు ఆమెను “చైల్డ్ వెల్ఫేర్ కమిటీ - సి డబ్ల్యు సి” నిర్వహిస్తున్న “రెస్క్యూ హోము” కు తరలించారు.


కొన్ని నెలల తరవాత తనపై 12 సార్లు అత్యాచార ప్రయత్నాలు, ఒకసారి అత్యాచారం జరిగిందని ఆ బాలిక పోలీసులకు మరో కేసులో సమాచారం ఇచ్చిందని పోలీస్ చీఫ్ తెలిపారు.


నిరుపేద కుటుంబం కావటం, తల్లి భుక్తి కోసం పొలాల్లో పనులకు వెళ్ళక తప్పక పోవటంతో ఒంటరిగా  ఉండే  ఈ మైనర్ బాలికపై ఇరుగు పొరుగున ఉండే పనులు, బాధ్యతలు వదిలేసిన అల్లర చిల్లర యువకులు ఆమెపై దాడికి, అత్యాచారానికి దిగటం తరచుగా గురవుతున్నట్లు పోలీసులు తెలిపారు. 


ఈ కేసులో ఇప్పటికి 44 మందిని  దోషులుగా గుర్తించామని ఇంకో 20 మంది వరకు అరష్ట్ చేయవలసి ఉందని తెలిపారు. ఇప్పుడా బాలికను “చైల్డ్ వెల్ఫేర్ కమిటీ - సి డబ్ల్యు సి” నిర్వహిస్తున్న వసతి గృహములో రక్షణ నిమిత్తం ఉంచారు.


సామాజిక కార్యకర్త పి. గీత అభిప్రాయం ప్రకారం "పలుమార్లు ఇలా  అకృత్యాలు ఆమెపై జరగుతుండటంతో ఇరుగు పొరుగువారి సూటి పోటి మాటలతో ఆత్మవిశ్వాసం కోల్పోయి  నిర్లక్ష్యానికి ధారుణంగా గురౌతుందని, ఇలాంటి “పోస్కో కేసు” ల్లో భాదితురాలు తరచుగా సమాజం నుండి  ఎదురయ్యే సవాళ్ళను తట్టుకొనేలా ఆ బాలికకు సరైన సలహా యిస్తూ, సున్నితమైన సమస్యను పర్యవేక్షించలేని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’ అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.


అలాగే ఆ బాలికను "రెస్క్యూ హోం" నుండి ఇంటికి తిరిగి పంపించేటప్పుడు ఆ బాలిక "రక్షణ" గురించి ఆలోచించ లేదని "చైల్డ్ వెల్ఫేర్ కమిటీ" తన బాధ్యతను పలుమార్లు విస్మరించిందని అందుకే ఆ బాలిక పలుమార్లు ఈ సమస్యలోకిి పడిపోతుందని గుర్తుచేశారు.


      


మరింత సమాచారం తెలుసుకోండి: