అమెరికా కొత్త అధ్యక్షుడు గా  జో బైడెన్ ప్రమాణానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొద్ది గంటల్లో ఆయన నూతన అధ్యక్షుడిగా కొలువు తీరుతారు. అయితే ఈసారి బైడెన్ ప్రమాణం చాలా విశేషాలతో కూడుకుని ఉంది అంటున్నారు. ఏకంగా శ్వేత సౌధంలో గతంలో ఎన్నడూ లేని కొత్త కళ కూడా రానుందని చెబుతున్నారు.

బైడెన్ తన టీం లో భారతీయ సంతతికి చెందిన వారికి ఎక్కువగా తీసుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ చెన్నైకి చెందిన భారతీయ సంతతివారు కావడమే విశేషం. ఇక కాశ్మీర్ కి చెందిన ఇద్దరు మహిళలను కూడ బైడెన్ తన సలహదారుల టీంలోకి తీసుకున్నారు.

బైడెన్ తో పాటు ప్రమాణం చేయనున్న కమలా హరీస్ పూర్తి భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చీర కట్టుతో వస్తారని అంటున్నారు. ఆమె తల్లి చెన్నై ని చెందిన సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ అని అందరికీ తెలిసిందే. అంతే కాదు,  ఆమె అమెరికా వలస వెళ్లారు. ఆ తరువాత అక్కడ పుట్టిన కమలా హరీస్ మానవ హక్కుల ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. అలా  ఉద్యమాలలో రాటుదేలి  డెమోక్రాట్ పార్టీలో ఆమె  కీలకంగా మారారు. ఆమె గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా  గెలిచారు. ఆమె తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడం కూడా రికార్డే.

ఇక భారతీయ సంతతికి చెందిన వారిని ఎక్కువ మందిని తన టీంలోకి తీసుకున్న బైడెన్ భారత్ తో రిలేషన్స్ ని ఎలా కొనసాగిస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ఏది ఏమైనా భారత్ కి పెద్ద పీట వేస్తున్న బైడెన్ విషయం ఆలోచిస్తే  అమెరికా భారత్ ల మధ్య మంచి స్నేహమే ఉంటుందని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అంటున్నారు. అమెరికా చూపు ఎపుడూ చైనా మీదనే ఉంటుందని, అందువల్ల చైనాను తగ్గించాలంటే కచ్చితంగా భారత్ వైపు మొగ్గు చూపక తప్పదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: