తెలంగాణలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నేతలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నారు అనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు  చెందిన ఒక కీలక నేత ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆయనతోపాటు వికారాబాద్ జిల్లా కు చెందిన ఒక నేత కూడా పార్టీ మారడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అలాగే సంగారెడ్డి లో కూడా ఒక నేత పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మారడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం ఇచ్చారని అంటున్నారు.

మరి వాళ్ళు పార్టీ మారతారా లేదా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక అగ్రనేత మాత్రం కచ్చితంగా బీజేపీ లోకి వెళ్ళ వచ్చు అని అంటున్నారు. ఏకంగా ఆయన కు బీజేపీ నుంచి ఎంపీ పదవితో పాటు అవసరమైతే తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత కూడా బీజేపీ అధిష్టానానికి చెప్పలేదని సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: