తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలను భారతీయ జనతా పార్టీ ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా సరే కొంతమంది నేతలు విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరి  విస్మయానికి గురిచేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఎంపీలను కూడా టార్గెట్ చేసి ఏకంగా కేంద్ర మంత్రి పదవులను కూడా ఆఫర్ చేయడం చాలామందికి ఆందోళనకు గురిచేసే అంశం.

టిఆర్ఎస్ పార్టీలో కీలకమైన ఒక ఎంపికి ఇప్పుడు పదవి ఆఫర్ చేయడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఏకంగా రాష్ట్రంలో ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విజయశాంతితో చాలా సన్నిహితంగా ఉండే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే ఆలోచనలో ఉండడంతో... టిఆర్ఎస్ పార్టీ కూడా అలెర్ట్ అయిందని సమాచారం. ఇప్పటికే ఆయనతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చలు జరిపారని ఆయన కూడా బీజేపీ లోకి రావడానికి అన్ని విధాలుగా కూడా అంగీకారం తెలిపారని అంటున్నారు.

ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా ఉగాది తర్వాత కచ్చితంగాఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఉగాది లోపు టిఆర్ఎస్ పార్టీలో మరికొంతమంది నేతలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి విషయంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతల్లో  అసహనం ఉంది. దీనితోనే వాళ్ళు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ బలపడాలంటే భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. కానీ ఈ విషయంలో సీఎం కేసీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఘోరంగా విఫలమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: