ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధాన  ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసే వాళ్ళం. తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతి చేశారని అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ఆరోపణలు ఎక్కువగా చేసిన పరిస్థితి ఉండేది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దర్యాప్తు బృందాలను నియమించారు.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో ఒక ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడుని... తాను అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో సవాల్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ కూడా ముందడుగు వేయలేక పోయారు. ఇప్పటికి కూడా అధికార పార్టీలో ఉన్న సరే చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని ఆరోపణలు చేయడం మినహా ఒక ఆరోపణ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ నిరూపించలేక పోయారు.

దీనితో వైసీపీ కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి కూడా ఈ ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక సామాజిక వర్గాల విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పులు పై వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గంకు ఎక్కువగా న్యాయం జరిగిందని పదేపదే ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసే వాళ్ళం. కానీ ఇప్పుడు వైసీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా తప్పు చేస్తున్నారని కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో అధికారంలోకి రావడం కష్టమవుతుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: