ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా బలపడాలని భావిస్తున్న నేపథ్యంలోనే కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో... భారతీయ జనతా పార్టీని స్పీడ్ గా ముందుకు తీసుకు వెళ్ళడంతో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలతో కొంతమంది బీజేపీ నేతలు సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు.

అలాగే అధికార పార్టీ నేతలతో కూడా కొంతమంది నేతలు ఇప్పుడు కలిసి ఉన్నారని... వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కొంతమంది నేతలు అసలు సహకరించడం  లేదని ఆయన సీరియస్ గా ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి తిరుపతి ఉప ఎన్నికలను ఆధారంగా చేసుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్న కొంతమంది నేతలు నియోజకవర్గాల్లో తిరగడం లేదు. తిరుపతి పార్లమెంటు పరిధిలో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కూడా ఎలాంటి సూచనలు సలహాలు నియోజకవర్గంలో ఉన్న నేతల నుంచి రావడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించినా అధికార పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చాలావరకు అంశాలను బీజేపీ నేతలు అనుకూలంగా మార్చుకునే స్థితిలో లేరు అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి పోరాటం చేయాల్సిన సరే తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలా మంది నేతలు అధికార పార్టీకి భయపడి రాకపోవడం లేకపోతే తెలుగుదేశం పార్టీ తో సన్నిహితంగా ఉండి ఆ పార్టీకి సహకరించడం వంటివి జరుగుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: