గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ మింగుడు పడట్లేదని  చంద్రబాబు  చేస్తున్న వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండుళ్లు కావొస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ని తరిమి కొట్టి వైసీపీ ని ఏరికోరి మరీ గద్దె ఎక్కించారు.. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ కి కట్టబెట్టి అధికారం జగన్ కి అప్పగించారు. ఈ తీర్పు తో అప్పుడు బ్లాంక్ అయిన చంద్రబాబు మైండ్ ఇప్పటివరకు కోలుకోలేదు. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదు అని ఇప్పటికీ జుట్టు పీక్కుంటు ఆలోచిస్తున్నాడు..దీనికి తోడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు..

ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలను సైతం జైలుకు పంపిన వైనం మనం చూసాం..చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు అవినీతుల చిట్టాను బయటకు తీస్తున్నాడు.. రాజధాని పేరు చెప్పుకుని టీడీపీ అధినేత సైతం ప్రజలను దోచుకున్నారు.. దాంతో చంద్రబాబు వైఖరికి ప్రజలు విసిగిపోయీ అధికారం జగన్ కి అప్పగించారు.. అయితే ఈ దుస్థితి చంద్రబాబు కు ఊరికే రాలేదు అంటున్నారు. అన్నగారికి వెన్నుపోటు పొడిచిన పాపం ఊరికో పోతుందా ఆ పాపమే ప్రస్తుతం పరిస్థితి కి కారణం అని చెప్తున్నారు. అవసరానికి వాడుకొని వదిలేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.

అందుకే వెన్నుపోటు సమయంలో ప్రజల నుంచి తిరుగబాటు రాకుండా నందమూరి కుటుంబాన్నే అడ్డం పెట్టుకున్న బాబు వారి నాశనానికి వారిచేతే పునాదులు వేయించాడు. మరి నందమూరి కుటుంబానికి అయినా న్యాయం చేశారా అంటే మొదట పురందేశ్వరి భర్త, రామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పదవి ఇచ్చినా ఆ తర్వాత పార్టీనుంచి బయటకు వెళ్లేలా అవమానాలకు గురిచేశారు. . ఎవరి మాట వినని సీతయ్య హరికృష్ణ చంద్రబాబు మాట విని ఫలితం అనుభవించిన సంగతి తెలిసిందే.. రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు.  ఇలా చంద్రబాబు చేసిన పాపాలు ఇప్పుడు ఆయన్ని ఈవిధంగా వెంటాడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: