ఏపీ లో ప్రస్తుతం కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే..రాష్ట్రంలో రామతీర్థం ఘటన సెగలు రేపుతుండగా ప్రతిపక్షాలు దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.. ఈనేపథ్యంలో బీజేపీ కపిలతీర్థం టూ రామతీర్థం వరకు ఓ రథయాత్ర కూడా ప్రారంభించింది. ప్రతి చోటా ఓ భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసి అక్కడ జాతీయ నేతలతో పార్టీ తరపున ఆధ్యాత్మిక పోరాటం చేయించాలని కూడా ప్లాన్ వేసింది.  అటు టీడీపీ కూడా రామతీర్థం ఘటన ను తాము బలపడేందుకు ఉపయోగించుకోనుంది. సీఎం జగన్ టార్గెట్ గా  ఇప్పటికే కొన్ని విమర్శలు చేసింది..

ఈ సమయంలో జగన్ ఢిల్లీ పయనం ఆసక్తిగా మారింది.. ఈరోజు ఢిల్లీ వెళ్లిన జగన్ ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఈ పర్యటన లో అమిత్ షా తో చర్చిస్తారని తెలుస్తుంది.   ముఖ్యంగా ఆలయాలపై దాడులు జరగడం వెనుక కుట్ర కోణం ఉందని అమిత్ షాకు వివరించనున్నట్లు సమాచారం. ఆలయాలపై దాడుల వెనుక కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా అంతర్వేది రథం దగ్ధం అంశంపై సీబీఐ విచారణను వెంటనే ప్రారంభించాలని సీఎం జగన్ కోరనున్నారు.వీరితో పాటు  కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1 న పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటుగా ప్రాజెక్టులకు నూతన నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ కి వెళ్లి ఎలాంటి నిర్ణయాలను రాష్ట్రాలకు తీసుకొస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: