ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చి పోతున్నారు అన్న విషయం తెలిసిందే. కొంత మంది దొంగలు తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని తాళాలు పగుల గొట్టి ఇళ్లను గుళ్ల  చేస్తూ ఉంటే మరి కొంత మంది దొంగలు ఆడవారు ఒంటరిగా వెళ్తే చాలు వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు దొంగ తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగల బెడద తగ్గించేందుకు  పోలీసులు ఎక్కడి కక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ   ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది.



 మహిళ రోడ్డుపై నడుచు కుంటూ వెళ్తున్న సమయం లో వెనక నుంచి వచ్చిన దొంగ  ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అంత లోనే అప్రమత్తమైన సదరు మహిళ ప్రతి ఘటించడం తో ఏకంగా చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమం లోనే తప్పించుకున్న మహిళ ఇక ఆ దొంగకు చుక్కలు చూపించింది.   చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన ఘటన యూపీలో వెలుగు లోకి వచ్చింది. బులంద్షహర్ జిల్లా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మీనా అనే 26 ఏళ్ల యువతి శివ నాడార్ యూనివర్సిటీ లో పని చేస్తుంది.


 ఇటీవలే విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సందర్భం లో ఆమెకు ఒక చేదు అను భవం ఎదురైంది. ఆమెను కొంత దూరం నుంచి వెంబడిస్తూ వచ్చిన ఒక దొంగ అదను  చూసి  సెల్ఫోన్ లాక్కెళ్లేందుకు  ప్రయత్నించాడు. ఇక సదరు యువతి ప్రతిఘటించడం తో ఏకంగా ట్రక్కు కిందకి తోసేసి చంపేందుకు ప్రయత్నించాడు ఇక ఎలాగోలా తప్పించుకున్న యువతి మరొకరి సాయం తో దొంగని పట్టుకుంది. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పగించింది. ఈ క్రమంలోనే సదరు యువతి ధైర్య సాహసాలకు పోలీసులు సైతం ఫిదా అయి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: