జనసేన తరుపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్...ఇప్పుడు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి రాపాక వైఖరి కాస్త అనుమానాస్పదంగానే ఉండేది. మొదట్లో కొన్నిరోజులు పార్టీలో తిరిగిన రాపాక, తర్వాత నుంచి మారిపోయారు. అసెంబ్లీలో జగన్‌కు భజన చేయడం మొదలుపెట్టారు. అలాగే సంక్షేమ పథకాల అమలు సమయంలో జగన్‌కు పాలాభిషేకాలు కూడా చేశారు.

దీంతో జనసేన శ్రేణులు రాపాకపై గట్టిగానే ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. రాపాకని పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ చేశారు. కానీ పవన్ ఆ పని చేయకుండా రాపాకని వదిలేశారు. ఇక చివరికి రాపాక వైసీపీ నాయకుడుగా మారిపోయి, పనులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాపాకకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కుతుందా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి.

ఎందుకంటే రాజోలు నియోజకవర్గం వైసీపీలో పలు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి బొంతు రాజేశ్వరరావు, రాపాకపై ఓడిపోయారు. బొంతు ఇప్పుడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అటు అమ్మాజీ కూడా వైసీపీ తరుపున కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ బొంతుకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్, బొంతు వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉందని, రాపాకకు వైసీపీ నుంచి టిక్కెట్ రావడం చాలా కష్టమని తెలుస్తోంది.

ఇక జనసేన ఎలాగో రాపాకని వదిలేసింది. కాబట్టి మరో కొత్త నేతని రాజోలు బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. అటు టీడీపీ తరుపున గొల్లపల్లి సూర్యారావు పనిచేస్తున్నారు. ఎటు తిరిగి రాపాక భవిష్యత్ గందరగోళంలో ఉంది. ఒకవేళ రాపాకకు గనుక జగన్ టిక్కెట్ ఇస్తే, మిగిలిన వైసీపీ శ్రేణులు సహకరించడం చాలా కష్టం. అటు రాజోలులో ఉన్న జనసేన శ్రేణులు రాపాకని ఓడించాలనే కసితో ఉన్నారు. కాబట్టి రాజోలులో రాపాకకు రానుంది కష్టకాలమే.

మరింత సమాచారం తెలుసుకోండి: