కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యాక ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా బాగా పెరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ని రీప్లేస్ చేస్తూ వైసీపీ వచ్చింది. ఇటు టీడీపీ ఎలాగో ఉంది. ఇక బీజేపీకి ఎలాగో బలం లేదు. జనసేన ఉన్నా సరే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా రాష్ట్రం విడిపోవడంతో 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు టీడీపీ కనిపించిది. అందుకే ప్రజలు చంద్రబాబు సీఎంని చేశారు.

ఇక ఐదేళ్లు బాబు చేసిన ఘనకార్యాలు ఏంటో అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్‌లో రాజధాని, సొంత వాళ్ళకే పథకాలు, ప్రచారానికే పరిమితమైన కంపెనీలు, అవినీతిలో ఆరితేరిన నేతలు...ఇలా చెప్పుకుంటూ పోతే గత చంద్రబాబు ప్రభుత్వం చాలానే చేసింది. చివరికి ప్రజల మద్ధతు పోగొట్టుకుంది. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపు చూశారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతుంది. ఈ 20 నెలల కాలంలో జగన్ పాలన పట్ల పెద్ద వ్యతిరేకిత రాలేదు. ఎందుకంటే అప్పులు చేసి మరీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టిన జగన్ అభివృద్ధిని పక్కనబెట్టేసినట్లే కనిపిస్తోంది. కొత్త రోడ్లు, కొత్త కంపెనీలు, కొత్త ప్రాజెక్టులు...ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి కొత్తగా ఏమి జరగలేదు.

పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల సొంత పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదనే టాక్ ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి రాగాలు తీస్తున్నారు. అయితే ఒక్క సంక్షేమం మీద జగన్ చివరి వరకు బండి లాగించడం కష్టమే అని తెలుస్తోంది.

దీంతో వచ్చి ఎన్నికల్లో ప్రజలకు పవన్ మంచి ఆప్షన్ అవ్వొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్-బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతుంది. కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ఏపీలో కూడా పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. అందుకే పవన్‌తో కలిసి చంద్రబాబు, జగన్‌లకు చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది. పవన్-బీజేపీలు గట్టిగా కష్టపడితే, నెక్స్ట్ ఎన్నికల్లోపు మంచిగా పికప్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. గెలవకపోయినా కనీసం వారికి పోటీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ప్రజలకు పవన్‌ మరో ఆప్షన్ అవుతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: