తెలంగాణలో ఉద్యోగుల వేతనాల పెంపు, పదోన్నతులు, నూతన ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై  చర్చ జరుగుతున్న నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన చేసారు. అంగన్‌వాడీలకు త్వరలో పదోన్నతులు ఇవ్వబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ఆమె తెలిపారు . కష్టకాలంలో, ఇబ్బందులలో కూడా పని చేస్తున్న అంగన్‌వాడీ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వాళ్ళ మేలు కోరుతూ పదోన్నతుల ప్రకటన చేసిందని  మంత్రి తెలిపారు... అయితే  నిన్న నగరంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో అంగన్‌వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ చీరలకు డబ్బుతో వెలకట్టకుండా , వాటిని కానుకగా భావించి స్వీకరించాలని ఆమె తెలిపారు . త్వరలో అందరికి చేనేత చీరలు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. గతంలో అంగన్‌వాడీలను వర్కర్లు అంటే సీఎం కేసీఆర్ ఇప్పుడు టీచర్లుగా పిలవాలని చెప్పి వారికీ మరింత గౌరవం కల్పించారని మంత్రి గుర్తు చేశారు.

ఈసారి కూడా  అంగన్‌వాడీలకు జీతాలు పెరుగుతాయని, ఖాళీలను కూడా  భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో అంగన్ వాడి టీచర్లు చేసిన సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు .. అయితే  అంగన్‌వాడీ టీచర్లకు సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా రూపొందించిన చీరలను పంపిణీ చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు అంగన్‌వాడీల అవసరం ఎంతో ఉందని, మార్కెట్లో లభించే వాటికంటే కంటే నాణ్యమైన బాలామృతాన్ని అంగన్‌వాడీలలో ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా భోజనం, కేసీఆర్‌ కిట్‌ కూడా అందిస్తున్నామని తెలిపారు.

కమిషనర్ దివ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ వార్డులో మన అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారని, వారికి ప్రత్యేక గుర్తింపు కోసం వారికి యూనిఫాం ఉండాలని అనుదుకే దీనిని రూపొందించామని  అన్నారు. 4 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ  టీచర్లకువీటిని  ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: