అప్పట్లో శృంగారభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది షకీలా. అంతేకాదు ఎన్నో సినిమాలలో  షకీలా ప్రధానపాత్రలో శృంగారభరితం గా తెరకెక్కేవి. షకీలా నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాలలో షకీలాను చూడటానికి మాత్రమే ఎంతో మంది ప్రేక్షకులు ఎగబడి మరీ థియేటర్లకు వెళ్లేవారు. ఎన్నో రోజుల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించి.. వందలాది సినిమాలలో నటించింది షకీలా. నాటి తరం ప్రేక్షకులకే కాదు నేటి తరం ప్రేక్షకులకు కూడా షకీలా  కొసమెరుపు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఎన్నో ఏళ్ల పాటు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సినిమాల్లో శృంగారభరితమైన పాత్రలలో  నటించిన షకీలా.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఇక వెండితెర పై కనుమరుగు అయ్యింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ వెండితెరపై కనిపించడం లేదు షకీలా. ఇకపోతే ఈ వెటరన్ హాట్ బ్యూటీ ఇటీవలె ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలోనే ఆలీ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఊహించని సమాధానాలు చెప్పుకొచ్చింది షకీలా.



 ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ గా  బాగానే ఉన్నారా అంటూ అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం సంపాదిస్తున్నాను తింటున్నాను బ్రతుకుతున్నాను బ్యాంక్ బాలన్స్ మాత్రం సున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఒక స్టార్ డైరెక్టర్ మీకు ఫోన్ చేసారంట కదా అంటూ ఆలీ ప్రశ్నించగా.. అవును లాక్ డౌన్ సమయంలో.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి.. ఏమ్మా బాగున్నావా.. ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేవు కదా.. ఏదైనా సహాయం కావాలి అంటే చెప్పు.. చాలా రోజుల తర్వాత గుర్తు వచ్చావు అందుకే ఫోన్ చేశాను అంటూ చెప్పడంతో ఏడ్చేసాను  అంటూ చెప్పుకొచ్చింది షకీలా.

మరింత సమాచారం తెలుసుకోండి: