కొన్ని నెలల నుండి ఏ క్షణం కోసమైతే అమెరికా ప్రజలంతా ఎదురు చూస్తున్నారో ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటా పోటీగా ఇరు పక్షాల మధ్యన దోబూచులాడిన విజయం జో బైడెన్ కూటమిని వరించిన విషయం తెలిసిందే. దీనితో మాజీ అమెరికా అధ్యక్షుడు తట్టుకోలేక చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వీటన్నింటికీ తెరదించే రోజు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం రేపు అనగా బుధవారం 20 వతేదీన రాత్రి 10 గంటలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే ఇక్కడ ఒక విశేషం ఉందని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోయే కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ  కావడంతో ఇటు మనదేశంలోని వారు మరియు అమెరికాలో ఉన్న భారతీయులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. జో బైడెన్ విజయం తరువాత డోనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు యూఎస్ క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. దాని తరువాత జరుగనున్న కార్యక్రమం కాబట్టి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భధ్రతా చర్యలను తీసుకుంటున్నారు.

ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. ఆ తరువాత కమలా హ్యారిస్ చేత ఉపాధ్యక్షురాలిగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం అమెరికాలోని అన్ని ప్రధాన ఛానెళ్లలో వీక్షించవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో కూడా దీనిని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: