పల్లెటూరి వాతావరణానికి మరియు పట్టణం  వాతావరణానికి చాలా తేడా  ఉంటుంది .. దానితో పాటు భాష మరియు వేషధారణ  కూడా వేరుగా ఉంటుంది .. ఇక మూఢ  నమ్మకాలను మరియు ఆచారాలను నగరాలలో అంతగా పట్టించుకోని జనం పల్లెటూర్లో మాత్రం ఆచారాలను నిబద్దతతో పాటిస్తూ ఉంటారు .. ఆ ఆచారాలు అనాదిగా ఇప్పటికి కొన్ని పల్లెటూరిలో జనాలు పాటిస్తూనే ఉంటారు .. ఆలా పాటించడం వాళ్ళ  ఊరికి లేదా వారి కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుందని నమ్మకం .. ఇటువంటి ఆచారాలు పాటిస్తున్న గ్రామాలూ ఇంకా ఉన్నాయి .. అప్పుడప్పుడు  నగరం నుండి ఎవరైనా యువకులు పల్లెటూర్లకి వస్తే  ఇలాంటి ఆచారాలను చాలా వింతగా తమ జీవితం లో ఎప్పుడు చూడని విధంగా చూస్తూ ఉంటారు  .. ఇక విషయంలోకి వెళ్తే చిత్తూర్ జిల్లాలోని ఒక గ్రామంలో  వింత ఆచారం అనాదిగా నడుస్తుంది .. మరి అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..



 చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండంల గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో .. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ ముగిసిన రెండు రోజులకు మూగ జీవాలకు వివాహం జరిపించడం కురవపల్లె అనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే , గొర్రెలను అంటువ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్థుల నమ్మకం. ఈ ఏడాది కూడా అనవాయితీ ప్రకారం.. గొర్రె, పొట్టేలుకు వైభవంగా కల్యాణం జరిపించారు. తొలుత దొడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసారు . అనంతరం గొర్రె, పొట్టేలులను వధూవరులుగా అలంకరించారు.

వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్‌ కుటుంబసభ్యులు నిలిచి ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. పెద్దల కాలం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా తమకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఇక, గొర్రె, పొట్టేలు కల్యాణానికి హాజరైన యువత సెల్‌ఫోన్‌లో వివాహ వేడక దృశ్యాలను చిత్రీకరించారు... ఇటువంటివి మనకి వింతగా అనిపించినా ఆ గ్రామస్తులకు మాత్రం ఇదొక పండగ జరుపుతుంటారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: