లోక్-సభ సభాపతి ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ - యు పి ఎస్ సి' ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ కు, అది నిర్వహించిన వివిధ దశ ల్లోని పరీక్షలు, తన తండ్రి పదవి అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా రాయకుండానే అడ్డుదారిలో ఐఏఎస్ కు ఎంపికైందని...ఫలితాలు ప్రకటించగానే, ఒక్కసారి వైల్డ్-ఫైర్ లా సోషల్ మీడియాలో సంచలన కథనాలు వైరల్ అయ్యాయి. ఇంకా అవుతూనేవునాయి.

దీంతో వ్యవహారం ఆసాంతం రాజకీయ రంగు పులుముకోగా – “ఫాక్ట్ చెక్ సంస్థ” 'యూపిఎస్ సి వెబ్సైట్' ద్వారా నిశితంగా పరిశీలించి నిజ నిర్ధారణ (ఫాక్ట్ చెక్)  చేసింది. వివిధ దశలలో జరిగే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన తరవాతే అంజలి బిర్లా ఎంపిక జరిగిందని దానికి విరుద్ధం గా వచ్చిన వార్తలు సంపూర్ణంగా అవాస్తవాలేనని నిర్ధారించింది,

అంతేకాదు ఈ సంస్థ వివిధ సబ్జెక్ట్స్ లో అంజలికి వచ్చిన మార్కులను కూడా షేర్ చేసి వాస్తవాలను వివరించింది. ఆమె అన్ని పరీక్షలు రాసి నిస్పాక్షికంగా ఐఏఎస్ కు ఎంపికైందని పక్కా ఋజువులతో ప్రకటించింది.

తను విజయవంతంగా ఐఏఎస్ కు ఎంపిక కాగా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారమైన, అవాస్తవాలకు అంజలి బిర్లా ధీటుగా బదులిచ్చింది. షికారు చేసే ఈ పుకార్లను విని తనకు నవ్వొచ్చిందని అంజలి పేర్కొంది. యూ పి ఎస్ సి పరీక్షలు చాలా నిస్పాక్షికంగా నిశితంగా జరుగుతాయని 900 పోస్టులకు గాను లక్షల సంఖ్యలో అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని దాని ఎదుర్కొని విజయం సాధించ వలసిందే తప్ప దానికి అడ్డుదార్లు ఉండవని అంజలి ఈ సందర్భంగా చెప్పారు.

గత రెండేళ్ళు తీవ్రంగా కష్టపడి పరీక్షలను ఏదుర్కు న్నా కూడా తొలి ప్రయత్నంలో ఎనిమిది మార్కుల తేడాతో విజయావకాశం కోల్పోయానని, ఇప్పుడు విజయాన్ని సాధించానని గర్వంగా చెప్పారు. ఇక్కడ తనను కాకపోయినా ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను తప్పని సరిగా గౌరవించాలని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: