ప్రస్తుతం దేశం లో ఎంతో ప్రతిష్టాత్మకం గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ లో భాగంగా ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్ కి కరోనా  వ్యాక్సిన్ అందిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. కాగా  దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రకాల వ్యాక్సిన్ లకు  అనుమతి ఇచ్చింది. సీరం  ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ , మరొకటి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్  అన్న విషయం తెలిసిందే.




 ఈ క్రమం లోనే ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తీసుకో కూడదు అనే దానిపై అధికారులు సూచనలు సలహాలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే .  అయితే ఇటీవలే తమ వ్యాక్సిన్ పై  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ అలర్జీ కలిగితే తమ వాక్సిన్ తీసుకోవద్దు అంటూ స్పష్టం చేసింది  సీరం.  టీకా కు సంబంధించిన పూర్తి వివరాలను ఫ్యాక్ట్ షీట్ ని విడుదల చేసింది.


 ఇక ఈ టీకా తయారీలో ఉపయోగించిన రసాయన పదార్థాల వల్ల ఎవరికైనా అలర్జీలు కలిగితే వ్యాక్సిన్  తీసుకోకపోవడమే మంచిది అంటూ తెలిపింది. అలాంటి వ్యక్తులు రెండోరోజు తీసుకోకుండా ఉండడం బెటర్ అంటూ స్పష్టం చేసింది సీరం ఇన్స్టిట్యూట్. అయితే ప్రజలు తమ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆరోగ్య సిబ్బందికి తమ  ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలపడం ఎంతో మంచిది అంటూ  సూచించింది.  అయితే ఇలా టీకా  తీసుకునే వారిలో ఎవరికైనా అలర్జీ సమస్యలు ఉన్నాయి అంటే ముందుగా వైద్య సిబ్బందికి తెలపాలని.. సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: