ఈ మధ్య కాలంలో మనిషి ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఎంతో విలువైన ప్రాణాలను చిన్నచిన్న కారణాలకే అర్దాంతరంగా తీసుకుంటున్నారు . క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు మంచి ఉద్యోగం ఆకర్షణీయమైన జీతం ఉంటే చాలు ఇక అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటారు. ఇక్కడ ఓ యువకుడికి ఈ రెండు ఉన్నప్పటికీ కూడా చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం అతని ఆలోచనా తీరు.


 ఆన్లైన్లో బెట్టింగ్స్ పెట్టాలి అనే అతని ఆలోచన అతని ప్రాణాలు మీదకు తీసుకువచ్చింది. చివరికి అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడమే  కాదు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడిన యువకుడు చివరికి వచ్చే జీతమే  కాదు ఇతరుల దగ్గర అప్పులు చేసిన సరిపోని ఆన్లైన్ బెట్టింగ్ లకు విధంగా బానిసగా మారిపోయాడు. చివరికి అప్పులపాలై మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


 పటాన్చెరు  చైతన్య నగర్ కాలనీకి చెందిన 28 ఏళ్ల రవి కుమార్ బెంగళూరు ఇన్ఫోసిస్ లో  సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్  హోం తో  ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రవికుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. ఇక కొన్ని రోజుల పాటు ఆన్లైన్ బెట్టింగుల తో అప్పుల పాలయ్యాడు. ఇక తండ్రి భాస్కర్ లక్ష రూపాయలు కట్టి అప్పు తీర్చినప్పటికీ మరికొన్ని అప్పులు  అలాగే ఉండి పోయాయి.  దీంతో చివరికి మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటుంబీకులు అతని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: