చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత శరవేగంగా పాకిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి శరవేగంగా పాకి  పోతూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ తో  ప్రపంచం మొత్తం వణికి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ అంటే ఒక సాధారణ ఫ్లూ  మాదిరిగానే భావిస్తున్నారు ప్రజలు. కరోనా వైరస్ గురించి అతిగా భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 అదే సమయంలో ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిన నేపథ్యంలో ఇక ప్రజలందరి లో ఉన్న కాస్త ఆందోళన కూడా పోయింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ కూడా కరోనా భయం ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న 36 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కరోనా వైరస్ భయంతో చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.



 కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించి.. అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఎంతో సురక్షితంగా ఉంటుంది అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక అక్కడికి చేరుకొని ఇక నెలరోజులపాటు ఎవరికీ దొరక్కుండా విమానాశ్రయంలోనే ఉన్నాడు.  చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు ఆదిత్య సింగ్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో  ఉంటున్నాడు. కరోనా వైరస్ భయంతో.. అక్టోబర్ 19న లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  నుంచి బయటకు వెళ్ళకుండా  రహస్యంగా ఉండిపోయాడు. చివరికి  పట్టుబడకుండా కొన్ని రోజుల పాటు గడిపాడు. చివరికి అధికారులు ఇటీవలే గుర్తించి ప్రశ్నించడంతో దొరికిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: