తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అయితే సీఎం షెడ్యూల్ హడావుడిగా ఖరారు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ప్రోగ్రాం షెడ్యూల్ రాగానే అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటిసారిగా 16 టీఎంసీలకు నీటి మట్టం చేరడంతో.. అది  చూసేందుకు సీఎం వచ్చారని అధికారవర్గాలు చెబుతున్నా... అసలు కథ మాత్రం వేరే ఉందనే చర్చ జరుగుతోంది.

        కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీని ఎత్తిపోసేందుకు పనులు చేపట్టింది సర్కార్. కన్నెపల్లి
పంప్‌ హౌస్‌లో మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు  ఆరు మోటార్లను బిగించారు. వాటిని పరిశీలించేందుకు సీఎం వచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అదనపు టీఎంసీ పనులు నిలిపి వేయాలని ఆదేశించింది. అయినా పనులు కొనసాగిస్తోంది కేసీఆర్ సర్కార్. అందుకే అధికారికంగా ఆ పంప్ హౌజ్ లను చూస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో.. వ్యూహాత్మకంగా మేడిగడ్డ బ్యారేజీ టూర్‌కు కేసీఆర్ వచ్చా‌రని అనుకుంటున్నారు. కాళేశ్వరం దర్శనం తర్వాత  ఏరియల్ వ్యూలో మూడో టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన మోటార్లను ముఖ్యమంత్రి పరిశీలించి ఉంటారని అంటున్నారు. ఇందుకోసం  మొదట మేడిగడ్డ పర్యటన ఖరారు చేసి తరువాత కాళేశ్వరం ఆలయంలో పూజలు చేయాలని నిర్ణయించారని భావిస్తున్నారు.


        గోదావరి తీరానికి వెళ్లిన ముఖ్యమంత్రి బ్యాక్ వాటర్‌ను చూసి ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఓ యజ్ఞంలా చేప్టటామని.. ఇప్పుడు సముద్రంగా కనిపిస్తున్న బ్యారేజీలను చూస్తే కపుడు నిండిపోతుందని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం టూర్ వెనక అసలు కథ వేరే ఉందని గ్రహించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తీవ్ర విమర్శలు చేశారు.కేంద్రానికి డీపీఆర్ ఇవ్వకుండా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం సందర్శించారని ఆరోపించారు. రెండేండ్లుగా కాళేశ్వరంతో రైతులకు చుక్క నీరు కూడా అందలేదన్నారు కేసీఆర్.



మరింత సమాచారం తెలుసుకోండి: