సాధారణంగా సినిమాల్లో సీరియల్స్ లో  కూడా అత్తా కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండడం ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమ చూపించడం లాంటివి చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అత్త అంటే కోడలికి.. కోడలు అంటే అత్తకి పంచప్రాణాలు అనే విధంగా ఉంటారు. అయితే ఇలా సినిమాలు, సీరియల్స్  లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతి ఒక్కరు కూడా.. అత్తా కోడళ్లు  నిజజీవితంలో కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. కానీ చాలా కుటుంబాల్లో ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఆధిపత్యం సాధించడానికి అత్త.. ఇక అత్త తీరుతో విసిగిపోయి చిరాకు పడే కోడలు   ఎప్పుడు మాటల యుద్ధం చేస్తూ ఉంటారు.




 దీంతో ఇక అటు తల్లికి సర్ది  చెప్పుకోలేక మరోవైపు భార్యకు నచ్చజెప్ప లేక మధ్యలో భర్త నలిగిపోతుంటాడు  అన్న విషయం తెలిసిందే. ఎవరో ఒకరి ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే దాదాపు అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. సినిమాలకి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఈ క్రమంలోనే అసలు సినిమాల్లో చూపించిన విధంగా అత్తా కోడళ్ళ మధ్య అమితమైన ప్రేమ అభిమానాలు ఉన్న కుటుంబం ఉండి ఉంటుందా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.  ఇక ఇక్కడ జరిగిన ఘటన తెలిస్తే మాత్రం మీరు అనుకునే కుటుంబం ఇదే అని ఫిక్స్ అయిపోతారు.




 సాధారణంగా అత్తా కోడలు ఎప్పుడూ గొడవ పడుతూ ఒకరి పై ఒకరు చాడీలు చెబుతూ.. మాటల యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కోడలు మాత్రం ఏకంగా అత్తకు గుడి కట్టించి పూజలు చేయడం ఆసక్తికరంగా మారిపోయింది. ఘటన ఛత్తీస్ గడ్ లో  వెలుగులోకి వచ్చింది. అత్తకు 11మంది కోడలు ఉన్నారు. ఇటీవలే ఆరోగ్య సమస్యల తో అత్త చనిపోవడంతో ఇక ఆమెకు ఒక గుడి కట్టి పూజలు భజనలు చేస్తున్నారు కోడళ్ళు. అయితే బతికినన్ని రోజులు కోడళ్ళను  ఎంతో ప్రేమగా చూసుకునేది అందుకే ఆమె చనిపోయిన తరువాత గుడి కట్టి విగ్రహానికి బంగారు ఆభరణాలు పెట్టి పూజలు  చేస్తున్నట్లు కోడళ్లు  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: