ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఇప్పుడు చాలా లోపాలు బయటపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను తమకు అనుకూలంగా లేని వారికి వైసీపీ నేతలు అందించడం లేదని ఆరోపణలు ఎక్కువగా రాజకీయవర్గాల్లో వినపడటం గమనార్హం. ప్రస్తుతం సీఎం జగన్ బలంగా ఉన్న నేపథ్యంలో విపక్షాలు కొన్ని విషయాలలో తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బలంగా ఉండటంతో... ఆరోపణలు చేసినా... అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పాలి.

సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలకు లేకపోతే వైసిపిలో స్థానిక నేతలకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేస్తూ వస్తున్నారు. అధికార పార్టీ నేతలలో మాత్రం మార్పు రావడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కులాలు మతాలు కూడా చూడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న వారికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు.

ఇక భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందక పోవడం గమనార్హం. కొన్ని మతాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు అని ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో సీఎం జగన్ ను నమ్ముకున్న చాలామందిలో ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనపడుతుంది. జగన్ కోసం కష్టపడిన వాళ్లు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అధికారులు కూడా పైస్థాయి నేతలు చెప్పిన మాటలు విని పని చేయడంతో వైసిపి స్థానిక నేతలకు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. కొంత మంది మంత్రుల విషయంలో కూడా ఇప్పుడు పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ... ఇదే వైఖరి కొనసాగితే మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే పెద్దగా ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: