ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏది  అయినా సరే కాస్త మితి మీరితే  మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.  ప్రతిరోజూ వ్యాయామం చేయాలని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. కానీ అతిగా వ్యాయామం చేస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అలాగే ప్రతిరోజూ తీసుకునే ఆహారం విషయంలో కూడా ఇలాంటి తరహా నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజు ఎలాంటి పౌష్టిక ఆహారం తీసుకున్నా లేకపోయినా ఒక గ్లాస్ పాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవటం వల్ల ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.


 ఇక పాలు తీసుకోవడం వల్ల ఎప్పుడూ చురుగ్గా ఉండడంతోపాటు.. గుండెజబ్బులు బిపి లాంటి సమస్యలు రావు అంటూ వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రతి రోజు క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల శరీరానికి కాల్షియం, పొటాషియం విటమిన్ డి లాంటి పోషకాలు అందుతాయి అని ఎన్నో అధ్యయనాల్లో  కూడా వెల్లడైంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎంతోమంది వైద్య నిపుణులు సూచించిన విధంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా పాలు తాగడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రతి రోజూ పాలు తాగడం మంచిదే కానీ పాలు తాగడంలో కూడా మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.  పాలు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం తప్ప ఉపయోగం ఉండదు అని హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా దీనికి సంబంధించిన విషయం అటు అధ్యయనంలో కూడా వెల్లడి కావడం గమనార్హం. సాధారణం కంటే పాలు ఎక్కువగా తాగడం వల్ల హార్మోనల్ బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్, మొటిమలు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ప్రతిసారి ఆరోగ్యానికి మంచిదే అనుకుంటే మాత్రం పొరపాటే అంటూ హెచ్చరిస్తున్నారు. అమితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: